ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 3వ సీజన్లో టేబుల్ టాపర్‌గా నిలిచి నేరుగా ఫైనల్ ఆడాలన్న ముంబై ఇండియన్స్ ఆశలపై డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నీళ్లు చల్లింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టును 11 పరుగులతో ఓడించిన బెంగళూరు ఈ టోర్నీని గెలుపుతో ముగించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు కెప్టెన్ స్మృతి మంధాన (37 బంతుల్లో 53, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎలీస్ పెర్రీ (38 బంతుల్లో 49 నాటౌట్, 5 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఛేదనలో ముంబై.. 20 ఓవర్లలో 188/9 వద్దే ఆగిపోయింది. సీవర్ బ్రంట్ (35 బంతుల్లో 69, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడింది. ఈ ఓటమితో ముంబై.. ఈనెల 13న గుజరాత్ జెయింట్స్‌తో ఎలిమినేటర్ ఆడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన విజేతతో ఈనెల 15న ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ పోరులో తలపడనుంది.