శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sports - Oct 31, 2020 , 15:07:16

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ముంబై

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ముంబై

దుబాయ్‌: ఐపీఎల్‌-13లో  మరో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ దుబాయ్‌ వేదికగా తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ముంబై తాత్కాలిక కెప్టెన్‌ పొలార్డ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. గాయం కారణంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. 

ముంబై ఇప్పటికే ప్లేఆఫ్‌ బెర్తు ఖాయం చేసుకోగా ఈ మ్యాచ్‌లో గెలిచి టాప్‌-4కు అర్హత సాధించాలని ఢిల్లీ  పట్టుదలతో ఉంది.   ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో ముంబై 16 పాయింట్లతో టేబుల్‌ టాపర్‌గా ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని ఢిల్లీ ఆడిన 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. 14 పాయింట్లతో  నెట్‌రన్‌రేట్‌ కారణంగా బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది.