Mumbai Indians | ముంబై: మరో రెండు రోజుల్లో మొదలుకాబోయే ఐపీఎల్-18వ సీజన్లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ తమ ఆరంభ మ్యాచ్‌ను రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా లేకుండానే ఆడనుంది. నిరుటి ఐపీఎల్లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతడిపై ఒక్క మ్యాచ్ నిషేధం ఉన్న నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో ముంబైని సూర్యకుమార్ నడిపించనున్నాడు. ఈనెల 23న ముంబై.. చెన్నై తో 2025 సీజన్‌ను ఆరంభించనుంది.