Ranji Trophy 2024 | ముంబైకి భారీ ఆధిక్యం.. పట్టు కోల్పోతున్న విదర్భ
Ranji Trophy 2024 | విదర్భతో ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై.. రెండో రోజు ఆట ముగిసేసమయానికి సెకండ్ ఇన్నింగ్స్లో 260 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Ranji Trophy 2024 | రంజీ ట్రోఫీని అత్యధిక సార్లు (41) గెలిచిన ముంబై జట్టు దానిని మరోసారి ముద్దాడేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. విదర్భతో ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై.. రెండో రోజు ఆట ముగిసేసమయానికి సెకండ్ ఇన్నింగ్స్లో 260 పరుగుల ఆధిక్యంలో ఉంది. విదర్భను తొలి ఇన్నింగ్స్లో 105 పరుగులకే ఆలౌట్ చేసి 119 పరుగుల కీలక ఆధిక్యాన్ని దక్కించుకున్న ముంబై.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోరు దిశగా సాగుతోంది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై.. 50 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 105 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని ఆ జట్టు ఇప్పటికే 260 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. ముంబై యువ బ్యాటర్ ముషీర్ ఖాన్ (51 బ్యాటింగ్), కెప్టెన్ అజింక్యా రహానే (58 బ్యాటింగ్)లు క్రీజులో ఉన్నారు. వికెట్లు చేతిలో ఉండటంతో పాటు వీలైనంత ఆధిక్యం కూడా దక్కడంతో ఈ ఫైనల్ టెస్టుపై ముంబై పూర్తి పైచేయి సాధించినట్టే. ఆట మూడో రోజు అయిన రేపు మొత్తం బ్యాటింగ్ చేయగలిగితే విదర్భ ఎదుట భారీ లక్ష్యం నిలపడం ఖాయం.
That’s stumps on Day 2 of the #RanjiTrophy #Final 🙌
Unbeaten half-centuries from Captain Ajinkya Rahane & Musheer Khan guide Mumbai to 141/2 in the second innings 👌👌
They now lead by 260 runs.
Scorecard ▶️ https://t.co/L6A9dXXPa2#MUMvVID pic.twitter.com/UyOJ6oX4sS
— BCCI Domestic (@BCCIdomestic) March 11, 2024
అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో మొదటి రోజే కనీసం 30 పరుగులు కూడా చేయకుండానే 3 వికెట్లు కోల్పోయిన విదర్భ.. రెండో రోజు 35 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. ఆ జట్టులో యశ్ రాథోడ్ ఒక్కడే 27 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ముంబై బౌలర్లలో ధవల్ కులకర్ణి, శామ్స్ ములానీ, తనూష్ కొటియాన్లు తలా మూడు వికెట్లు తీయగా శార్దూల్ ఠాకూర్ ఒక్క వికెట్ పడగొట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ముంబై 224 పరుగులకు ఆలౌట్ అయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

