Madrid Open | మ్యాడ్రిడ్: స్పెయిన్ వేదికగా జరుగుతున్న మ్యాడ్రిడ్ ఓపెన్‌లో ఇండో-ఆస్ట్రేలియా జోడీ రోహన్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్‌కు తొలి రౌండ్లోనే నిరాశ ఎదురైంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న-ఎబ్డెన్ ద్వయం 6-7 (4/7), 5-7 తేడాతో సెబాస్టియన్ కోర్డా-జోర్డన్ థామ్సన్ చేతిలో చిత్తయ్యారు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ 5-7, 4-6 తేడాతో 22 ఏండ్ల చెక్ రిపబ్లిక్ కుర్రాడు జిరి లెహెక చేతిలో ఓడిపోయాడు.