Leopard | పారని పాచిక చిక్కని చిరుత.. ‘శంషాబాద్ పరిసరాల్లో గాలింపు
శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో సంచరిస్తున్న చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఒకే ప్రాంతంలో చిరుత తిరుగాడుతున్నట్లుగా గుర్తించారు.
- మేకలను ఎరేసినా ఫలితం శూన్యం
- బోను దాకా వచ్చి వెళ్లిపోతున్న వైనం
Leopard | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో సంచరిస్తున్న చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఒకే ప్రాంతంలో చిరుత తిరుగాడుతున్నట్లుగా గుర్తించారు. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు నమోదుకాగా మేకలను ఎరగా వేసినా అది మాత్రం బోను వరకు వచ్చి వెళ్లిపోతున్నది. నాలుగు రోజులుగా బోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. బోన్ దగ్గరికి వచ్చిపోతున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయని వెల్లడించారు.
గత నెల 28న శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి గొల్లపల్లి వద్ద ఎయిర్‌పోర్టు ప్రహరీ నుంచి చిరుత దూకిన విషయం తెలిసిందే. ఈ చిరుత మహబూబ్‌నగర్ పరిసరాల నుంచి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దాని పిల్లలు కూడా ఇదే ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా అనుమానం ఉందన్నారు. జనాభా పెరగడం, అడవుల్లో జంతు ఆవాసాలు దెబ్బతినడం, వేట, నీరు దొరకని పరిస్థితి తలెత్తడం వల్లే చిరుతలు జనావాసాల్లోకి వస్తున్నట్లు చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగా ఏ జంతువైనా అడవి నుంచి బయటకు రాదని, అడవుల్లో మానవ ప్రమేయం పెరగడం వల్లే ఇలాంటివి ఎదురవుతున్నాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

