Tim David : ఐపీఎల్ పదహారో సీజన్(IPL 2023)లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) బ్యాటర్ టిమ్ డేవిడ్(Tim David) సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. ఆఖరి ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేస్తున్నాడు. దొరికిన బంతిని దొరికినట్టు స్టాండ్స్ దాటిస్తున్నాడు. అతను నిన్న రాత్రి ముంబైలోని వాంఖేడే స్టేడియంలో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. సిక్సర్లతో చెలరేగిన ఈ యంగ్‌స్టర్ ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. మ్యాచ్ అనంతరం ఈ పవర్ హిట్టర్ మాట్లాడుతూ.. ‘మేం చెత్త ప్రదర్శనతో కెప్టెన్ రోహిత్ శర్మకు నిద్రలేకుండా చేశాం’ అని సరదాగా అన్నాడు.
‘నాకు మ్యాచ్‌ను ఇలా ముగించడమంటే చాలా ఇష్టం. ఇలాంటి గేమ్ కోసం ఎంతో ఎదురుచూశా. ఎట్టకేలకు ఈరోజు అద్భుతంగా ఆడాం. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం’ అని ఈ యంగ్‌స్టర్ తెలిపాడు. విజయావకాశాలు ఇరుజట్లకు సమానంగా ఉన్న సమయంలో డేవిడ్ అద్భుతం చేశాడు. 14 బంతుల్లోనే 45 రన్స్ కొట్టి ముంబైకి చిరస్మరణీయ విజయం అందించాడు.
1️⃣0️⃣0️⃣0️⃣th IPL match. Special Occasion…
…And it ends with an electrifying finish courtesy Tim David & @mipaltan 💥💥💥
Scorecard ▶️ https://t.co/trgeZNGiRY #IPL1000 | #TATAIPL | #MIvRR pic.twitter.com/qK6V5bqiWV
— IndianPremierLeague (@IPL) April 30, 2023
ఐపీఎల్ చరిత్రలో 1000వ మ్యాచ్ అభిమానులకు కావాల్సినంత కిక్ ఇచ్చింది. రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తలపడిన ఈ పోరులో పరుగుల వరద పారింది. ఫోర్లు, సిక్స్‌లతో స్టేడియం హోరెత్తిపోయింది. మొదట ఆడిన రాజస్థాన్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(124 : 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగడంతో ముంబైకి 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సంచలన విజయం సాధించింది. జేసన్ హోల్డర్ వేసిన 20వ ఓవర్లో విధ్వంసక ఆటగాడు టిమ్ డేవిడ్ రెచ్చిపోయాడు. మూడు బంతుల్లో మూడు సిక్స్‌లు బాది ముంబైని గెలిపించాడు.
𝙔𝙖𝙨𝙨-𝙝𝙖𝙨𝙫𝙞 𝙅𝙖𝙞𝙨𝙬𝙖𝙡 💯
The @rajasthanroyals opener scored his maiden IPL century and put his side on 🔝#IPL1000 | #TATAIPL | #MIvRR
Sit back and enjoy his stunning knock 🎥🔽https://t.co/jyy27rPM8o
— IndianPremierLeague (@IPL) April 30, 2023
భారీ లక్ష్య ఛేదనలో కామెరూన్ గ్రీన్(44 : 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్(55 : 29 బంతుల్లో8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఆడారు. దాంతో, కెప్టెన్ రోహిత్ శర్మకు జట్టు సభ్యులు విజయాన్ని బర్త్ డే కానుకగా అందించాడు.