ఆస్తానా: ప్రపంచ చెస్‌కు కొత్త రాజు అవతరించాడు. కజకిస్థాన్‌లో జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో రష్యా గ్రాండ్‌మాస్టర్ ఇయాన్ నిపోమ్నియాషిపై చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్ గెలుపొంది కార్ల్సన్ వారసుడిగా నిలిచాడు.
చాంపియన్‌షిప్ పోరులో 14 గేమ్‌ల అనంతరం ఇరువురూ చెరి 7 పాయింట్లతో సమంగా నిలవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. నాలుగు గేమ్‌ల టైబ్రేక్‌లో తొలి మూడు గేమ్‌లు డ్రా కాగా చివరి గేమ్‌ను గెలుచుకుని డింగ్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఈ టైటిల్ గెలిచిన తొలి చైనా ఆటగాడు డింగ్.