ముంబై: చారిత్రక వాంఖడే స్టేడియంలో స్టాండ్లకు ముగ్గురు ప్రముఖ వ్యక్తులు రోహిత్‌శర్మ, అజిత్ వాడేకర్, శరద్‌పవార్ పేర్లు పెట్టారు. మంగళవారం సమావేశమైన ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎమ్సీఏ) వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు అజింక్యా నాయక్ పేర్కొన్నాడు. దేశ క్రికెట్‌కు సేవలకు గుర్తింపుగా స్టేడియంలో స్టాండ్లకు నామకరణం చేసినట్లు ఎమ్సీఏ తెలిపింది.
దివేచా పెవిలియన్ లెవల్-3 స్టాండ్‌కు రోహిత్‌శర్మ పేరు పెట్టగా, గ్రాండ్‌స్టాండ్ లెవల్-3కి శరద్‌పవార్, లెవల్-4కు వాడేకర్ స్టాండ్లుగా ఖరారు చేశారు. 2022లో టీమ్ఇండియా కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన రోహిత్ 2024 టీ20 ప్రపంచకప్‌తో పాటు ఇటీవల చాంపియన్స్ ట్రోఫీని గెలువడంలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.