హైదరాబాద్, ఆట ప్రతినిధి: రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో హైదరాబాద్ జట్టు నాకౌట్‌కు వెళ్లే అవకాశాలు మూసుకుపోయినట్టే! ఎలైట్ గ్రూప్-డీలో భాగంగా సొంతగడ్డపై ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో దారుణ పరాభవానికి గురైంది. తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకే ఆలౌట్ అయి ఫాలో ఆన్ ఆడిన హైదరాబాద్.. నాలుగో రోజు 166/7తో ఆట ఆరంభించి కాస్త ప్రతిఘటించింది.
లోయరార్డర్లో మిలింద్ (85), నితిన్ (32), కెప్టెన్ సిరాజ్ (32) పోరాడి ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించి ముంబై ఎదుట 10 పరుగుల లక్ష్యాన్ని నిలిపారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ముంబై ఒక వికెట్ కోల్పోయి 9 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని నమోదుచేసింది. తాజా ఓటమితో గ్రూప్ డీ లో ముంబై (30) నాకౌట్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకోగా జమ్మూకాశ్మీర్ (21) రెండో స్థానంలో ఉంది. 13 పాయింట్లతో హైదరాబాద్ ఐదో స్థానాన నిలిచింది.