MS Dhoni | కెరీర్లో చివరి ఐపీఎల్.. బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టిన ధోనీ.. వీడియో
MS Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) చివరి ఐపీఎల్ సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. 42 ఏండ్ల మహీ తన బ్యాటింగ్ విన్యాసాలతో ఫ్యాన్స్‌ను అలరించేందుకు నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) గొప్ప కెప్టెన్లలో...
MS Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) చివరి ఐపీఎల్ సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. 42 ఏండ్ల మహీ తన బ్యాటింగ్ విన్యాసాలతో ఫ్యాన్స్‌ను అలరించేందుకు నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) గొప్ప కెప్టెన్లలో ఒకడైన ధోనీ మార్చిలో జరుగబోయే 17వ సీజన్ కోసం ప్రాక్టీస్ షురూ చేశాడు. నెట్స్‌లో అతడు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
పదహారో సీజన్ అనంతరం మోకాలి సర్జరీ చేయించుకున్న ధోనీ ఈమధ్యే కోలుకున్నాడు. ఫిట్నెస్ సాధించేందుకు జిమ్‌లో కష్టపడుతూనే.. మరోవైపు బ్యాటింగ్ మీద దృష్టి పెట్టాడు. తన మార్క్ కెప్టెన్సీతో చెన్నైకి ఐదో సారి ట్రోఫీ అందించిన మహీ.. 2024 ఎడిషన్‌లో మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
MS Dhoni has started practicing for IPL 2024.
Get ready for THALA’s last dance 🔥❤️
Video: kushmahi7/IG#CricketTwitter #MSDhoni pic.twitter.com/b9kGknWubC
— Ishan Joshi (@ishanjoshii) January 10, 2024
భారత కెప్టెన్లలో ధోనీ ఎవర్గ్రీన్ అనే చెప్పాలి. అవును… అతడి హయాంలోనే టీమిండియా రికార్డు స్థాయిలో మూడు ఐసీసీ ట్రోఫీ(టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ)లు గెలిచింది. భారత కెప్టెన్‌గా మరెవరకీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పిన ధోనీ ఐపీఎల్‌లోనూ సారథిగా అదరగొడుతున్నాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ స్టార్ క్రికెటర్ ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు.

కరోనా కారణంగా రెండేండ్ల తర్వాత స్వదేశంలో జరిగిన సీజన్లో కుర్రాళ్లతో కూడిన చెన్నై సూపర్ కింగ్స్‌తో మహీ అద్భుతమే చేశాడు. జడేజా, అంబటి రాయుడు, రాహానే మినహా స్టార్ ఆటగాళ్లు లేని జట్టును ఏకంగా చాంపియన్‌గా నిలిపాడు. దాంతో, సీఎస్కే ఐదోసారి ట్రోఫీని ముద్దాడి ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది.
దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న వ జరిగిన 17వ సీజన్ మినీ వేలంలో చెన్నై స్టార్ ఆటగాళ్లను పట్టేసింది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్లు డారిల్ మిచెల్, రచిన్ రవీంద్రలతో పాటు మాజీ సభ్యుడు శార్దూల్ ఠాకూర్‌ను సొంత గూటికి చేర్చుకుంది. దాంతో, బౌలింగ్, బ్యాటింగ్.. విభాగాల్లో సీఎస్కే సారి మరింత పటిష్టంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
- Coronavirus | 24 గంటల్లో 514 కొత్త కేసులు.. మూడు మరణాలు
- Rahul Dravid | ఆస్ట్రేలియాకు కొరకరాని కొయ్య.. భారత జట్టుకు గోడ.. ద్రవిడ్ కెరీర్లో మైలురాళ్లు ఇవే
- Malaika Arora | గులాబీ డ్రెస్‌లో పరువాలు ఒలకబోస్తున్న మలైకా అరోరా..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

