MS Dhoni | టీమ్ ఇండియా (Team India) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తన ఆటతీరుతో పాటు సింప్లిసిటీతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవల్ అని చెప్పొచ్చు. ధోనీ కనిపిస్తే చాలు ఆయన్ని చుట్టుముట్టి ఆటోగ్రాఫ్స్, షేక్ హ్యాండ్స్, సెల్ఫీలకు ఎగబడుతుంటారు ఫ్యాన్స్. ఆయనకు సంబంధించిన ఏ చిన్న వీడియోనైనా సరే ఇట్టే నెట్టింట వైరల్ చేసేస్తుంటారు. తాజాగా ధోనీకి సంబంధించిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది
ఓ అభిమాని తన బైక్‌పై ధోనీని ఆటోగ్రాఫ్ (Autograph) అడిగాడు. మిస్టర్ కూల్ వెంటనే బైక్ ముందు పెట్రోల్ ట్యాంక్‌పై తన సంతకం చేశాడు. అంతటితో ఆగని ఆ ఫ్యాన్ తన చేతిపై కూడా సంతకం చేయాలని కోరాడు. ‘ఎలా అయినా పర్లేదు సర్.. సైన్ చేయండి చాలు’ అని విజ్ఞప్తి చేశాడు. దీనికి ధోనీ.. ‘నీకు ఎలా కావాలో చెప్పు. అలా చేస్తా’ అంటూ ఎంతో కూల్‌గా స్పందించాడు. అనంతరం అభిమాని కోరిక మేరకు అతడి హ్యాండ్పై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘నువ్వు చాలా లక్కీ భయ్యా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
Also Read..
ISIS Terrorists | దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు అరెస్ట్
Helicopter Crashes | కుప్పకూలిన హెలికాప్టర్.. ఐదుగురు మృతి
Thar | థార్ నడపడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు : హర్యాణా డీజీపీ