MS Dhoni : భారత క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) పేరు ఓ సంచలనం. ఆటగాడిగా, కెప్టెన్‌గా తన ముద్ర వేసిన మహీ టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లోనూ విజయవంతమైన సారథిగా పేరు తెచ్చుకున్నాడు. నిరుడు చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings) జట్టుకు ఐదో ట్రోఫీ కట్టబెట్టి కెప్టన్‌గా తనకు తిరుగులేదని అనిపించుకున్నాడు.
క్రికెట్ దిగ్గజాల్లో ఒకడైన ధోనీ సీఎస్కే నాయకుడిగా 16 ఏండ్లు పూర్తి చేసుకున్నాడు. దాంతో, చెన్నై ఫ్రాంచైజీ ఎక్స్ ఖాతాలో తాలాకు అభినందనలు తెలుపుతూ పోస్ట్ పెట్టింది. ‘పదహారేండ్లు – ఒకే ఒకపేరు’ అనే క్యాప్షన్‌తో ధోనీ కెరీర్‌ను ప్రతిబింబించేలా ఆ పోస్ట్ ఉంది.
1⃣6⃣ years- 1⃣ Name!
𝗧𝗛𝗔𝗟𝗔🦁💛 pic.twitter.com/ljOq7C3Kcq
— Chennai Super Kings (@ChennaiIPL) February 20, 2024
ముంబై వేదికగా ఫిబ్రవరి 20న ఐపీఎల్ తొలి సీజన్ వేలం జరిగింది. 2007లో సారథిగా భారత్‌కు పొట్టి ప్రపంచకప్ అందించిన ధోనీ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. చివరకు సీఎస్కే రూ.9.5 కోట్లకు మిస్టర్ కూల్ కెప్టెన్‌ను కొనుగోలు చేసింది. సీఎస్కే మేనేజ్మెంట్ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టుకు ఎనలేని గుర్తింపు తెచ్చింది. అనతికాలంలోనే తాలాగా కీర్తించబడిన ధోనీ సీఎస్కేకు 2010లో తొలి ట్రోఫీ సాధించి పెట్టాడు.
16వ సీజన్ ట్రోఫీతో సీఎస్కే జట్టు
మహీ కెప్టెన్సీలో అద్భుతమైన జట్టుగా ఎదిగిన చెన్నై 2011, 2018, 2021, 2023లో ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. అందుకనే ధోనీ అంటే చెన్నై ఫ్రాంచైజీకి, అభిమానులకు ఎనలేని ప్రేమ. అతడు చెపాక్‌లో దిగాడంటే స్టేడియమతా ధోనీ.. ధోనీ నినాదాలతో మార్మోగిపోతోంది. ప్రస్తుతం 41 ఏండ్ల వయసున్న మహీ కెరీర్లో చివరి ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నాడు. 2024 ఎడిషన్ తర్వాత సీఎస్కేలో తాలా కొనసాగుతాడా? కోచ్‌గా అవతారమెత్తుతాడా? అనే దానిపై స్పష్టత రానుంది.