Plane Villa | ఇటీవలే కాలంలో కొందరు పాతపడిపోయిన కార్లు, బస్సులను ఇల్లుగా మార్చుకొని అందులోనే శాశ్వత నివాసం ఏర్పరుచుకుంటున్నారు. అయితే, తాజాగా ఓ వ్యక్తి ఏకంగా ఫ్లైట్‌నే లగ్జరీ విల్లాగా (Plane Villa) మార్చి ఔరా అనిపిస్తున్నాడు.
రష్యాకు చెందిన ఫెలిక్స్ డెమిన్ (Felix Demin) అనే వ్యక్తి ఓ పాతపడిన బోయింగ్ 737 విమానాన్ని కొని దాన్ని అద్భుతమైన ప్రైవేట్ విల్లాగా మార్చేశాడు. ఈ విల్లాను ఇండోనేషియాలోని బాలిలో న్యాంగ్ న్యాంగ్ బీచ్ (Nyang Nyang Cliffs) సమీపంలో ఏర్పాటు చేశాడు. ఈ ఫ్లైట్ విల్లాలో రెండు పడకల గదులు, బార్, లివింగ్ రూమ్, ఇన్ఫినిటీ పూల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. కాక్‌పిట్‌ను ఓ పెద్ద బాత్‌రూమ్‌లా మార్చేశాడు. విమానంలోని ప్రతి స్థలాన్ని ఉపయోగించి తనకు నచ్చినట్లు బెస్ట్ ఇంటీరియర్‌తో ఎంతో అందంగా తీర్చిదిద్దాడు. ఈ ప్లేన్ విల్లాలోని ప్రత్యేకతలు, ఆశ్చర్యపరిచే విషయాలన్నింటినీ వివరిస్తూ హోమ్‌టూర్ చేసి ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫ్లైట్ విల్లా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
సముద్రపు ఒడ్డున నిర్మించిన ఈ ఫ్లైట్ శ్వేత సౌధం.. సామాజిక మాధ్యమాల్లో నిత్యం చిరుగ్గా ఉంటూ వినూత్నంగా, ఆసక్తిని కలిగించే ప్రతి విషయాన్ని నెటిజన్లతో పంచుకునే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) దృష్టిని సైతం ఆకర్షించింది. వెంటనే ఈ ఫ్లైట్ విల్లా వీడియోని మహీంద్ర తన ఎక్స్ వేదిగా షేర్ చేశారు. ‘కొంతమంది మాత్రమే తమ కలల్ని సాకారం చేసుకునే అదృష్టాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తి మాత్రం తన కలలపై ఎలాంటి పరిమితులు విధించినట్లు కనిపించడం లేదు. నాకు ఎప్పుడైనా ఇక్కడ బస చేయాలని ఆసక్తి కలుగుతుందో లేదో చూడాలి’ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Some people are fortunate enough to be able to turn their fantasies into reality.
And this chap doesn’t seem to impose any constraints on his imagination!
I’m trying to figure out whether I’d ever be interested in booking a stay here but I’m a bit worried about jet lag post… pic.twitter.com/LhH2Rtn5Ht
— anand mahindra (@anandmahindra) February 17, 2024
View this post on Instagram
A post shared by Виталия Лапина | Организатор свадеб и мероприятий Дубай Москва (@vitaliya_lapina)
Also Read..
Kamal Nath | బీజేపీలోకి మధ్యప్రదేశ్ మాజీ సీఎం..? త్వరలో రామ మందిరాన్ని సందర్శించనున్న కమల్ నాథ్
Kamal Haasan | రెండు రోజుల్లో గుడ్‌న్యూస్ చెప్తా.. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుపై కమల్ హాసన్
Ayodhya Ram Mandir | అయోధ్యలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. క్యూలైన్ల నిర్వహణపై టీటీడీ సూచనలు