Kamal Nath | బీజేపీలోకి మధ్యప్రదేశ్ మాజీ సీఎం..? త్వరలో రామ మందిరాన్ని సందర్శించనున్న కమల్ నాథ్
Kamal Nath | మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ (Kamal Nath) కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. ఆయన తన కుమారుడు నకుల్‌నాథ్‌తో కలిసి బీజేపీ (BJP)లో చేరే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు మరో వార్త జాతీయ మీడియాలో వైరల్ అవుతోంది.
Kamal Nath | లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Poll) సమీపిస్తున్న తరుణంలో దేశంలో రాజకీయాలు వేడెక్కాయి. పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ (Kamal Nath) కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. ఆయన తన కుమారుడు నకుల్‌నాథ్‌తో కలిసి బీజేపీ (BJP)లో చేరే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు మరో వార్త జాతీయ మీడియాలో వైరల్ అవుతోంది.
కమల్ నాథ్ తన కుటుంబంతో కలిసి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని సందర్శించనున్నట్లు (Ayodhya Ram Mandir) సంబంధిత వర్గాలు వెల్లడించినట్లుగా జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. సోమవారం లేదా మంగళవారం నాడు కమల్ నాథ్ కుటుంబంతో కలిసి అయోధ్యలో కొలువైన బాలరాముడిని దర్శించుకునే అవకాశం ఉందని సదరు వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.
కాగా, గత కొన్ని రోజులుగా హస్తం పార్టీపై కమల్‌నాథ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కమల్‌నాథ్ చింధ్వారా స్థానం నుంచి తొమ్మిది సార్లు ఎంపీగా చేశారు. ప్రస్తుతం అదే చింధ్వారా ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమితో కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన్ను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. పీసీసీ అధ్యక్షుడిగా తొలగించిన విధానంపై కమల్‌నాథ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కుమారుడితో కలిసి ఆయన హస్తం పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఢిల్లీ చేరుకొన్న కమల్‌నాథ్ వర్గం ఎమ్మెల్యేలు
బీజేపీలో చేరేందుకు మాజీ సీఎం కమల్‌నాథ్ తన కుమారుడు, ఎంపీ నకుల్‌నాథ్‌తో కలిసి ఢిల్లీ చేరుకొన్నారని ఓవైపు ప్రచారం జరుగుతుండగా.. ఇందుకు బలం చేకూర్చేలా కీలక పరిణామం చోటుచేసుకొన్నది. కమల్‌నాథ్‌కు విధేయులుగా భావించే మధ్యప్రదేశ్‌కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం ఢిల్లీ చేరుకొన్నారు. చింధ్వారా రీజియన్‌కు చెందిన వీరంతా కమల్‌నాథ్‌తో కలిసి కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్యాంపులో మాజీ మంత్రి లఖన్ గంగోరియా కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. వీరంతా కాంగ్రెస్ అగ్రనేతల ఫోన్లకు స్పందించడం లేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్‌లో 20 మందికి పైగా పార్టీ ఎమ్మెల్యేలను తమ వెంట తీసుకెళ్లేందుకు కమల్‌నాథ్ వర్గం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
Also Read..
Kamal Haasan | రెండు రోజుల్లో గుడ్‌న్యూస్ చెప్తా.. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుపై కమల్ హాసన్
Heavy Snow | ఉత్తరాదిపై మంచు దుప్పటి.. వీడియోలు
Ayodhya Ram Mandir | అయోధ్యలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. క్యూలైన్ల నిర్వహణపై టీటీడీ సూచనలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

