Heavy Snow | ఉత్తరాదిపై మంచు దుప్పటి.. వీడియోలు
Heavy Snow | ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది (Heavy Snow). జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh)లోని చాలా ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతోంది.
Heavy Snow | ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది (Heavy Snow). జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh)లోని చాలా ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణంతో ఆకట్టుకుంటున్నాయి. ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. అడుగుల మేర పేరుకుపోయిన మంచుతో పర్యాటకులను (Tourists) ఆహ్వానిస్తున్నాయి. పర్యాటకులు ఈ శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మంచులో ఆటలాడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. సిమ్లాలోని కుఫ్రి, ఖరపత్తర్, మనాలీ (Manali) సహా పలు ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి. రహదారులు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలు, ఎత్తైన కొండలపై పడుతున్న మంచు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. సందర్శకులు మంచు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. మంచులో తడుస్తూ ఆటలు ఆడుతూ సందడి చేస్తున్నారు. మరోవైపు రహదారులు మంచుతో నిండిపోవడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై పేరుకుపోయిన మంచును అధికారులు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. ఇక జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా, పూంచ్ (Poonch)లో గల సావ్జియాన్ సెక్టార్ ( Sawjian Sector)లో కూడా భారీగా హిమపాతం కురుస్తోంది.
#WATCH | Himachal Pradesh: Manali covered in a blanket of snow after the city receives fresh snowfall pic.twitter.com/Eg9i37sauW
— ANI (@ANI) February 19, 2024
#WATCH | Poonch, J&K: Sawjian Sector of Poonch receives fresh snowfall. pic.twitter.com/TFipCrGDMD
— ANI (@ANI) February 19, 2024
#WATCH | Jammu & Kashmir’s Kupwara receives heavy snowfall pic.twitter.com/16Na1zSvxc
— ANI (@ANI) February 19, 2024
Also Read..
Chandigarh | బీజేపీలో చేరిన ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు.. ఆసక్తికరంగా చండీగఢ్ మేయర్ ఎన్నిక!
SKM | 21న నల్లజెండాలతో నిరసన.. ఆందోళనకు పిలుపునిచ్చిన ఎస్కేఎం
Congress | కాంగ్రెస్‌లో సంక్షోభం.. ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్‌బై చెబుతున్న సీనియర్ నేతలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

