Chandigarh | బీజేపీలో చేరిన ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు.. ఆసక్తికరంగా చండీగఢ్ మేయర్ ఎన్నిక!
అదేసమయంలో ఆప్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరడం విశేషం. దీంతో ఆ పార్టీ బలం 17కు చేరింది.
చండీగఢ్: ఇటీవల వివాదాస్పదమైన చండీగఢ్ (Chandigarh) మేయర్ ఎన్నిక ఎపిసోడ్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. జనవరి 30న భారీ హైడ్రామా మధ్య జరిగిన మేయర్ (Mayor) ఎన్నికలో ప్రిసైడింగ్ అధికారి విజేతగా ప్రకటించిన బీజేపీ నేత మనోజ్ సోన్కర్ (Manoj Sonkar) తన పదవికి రాజీనామా చేశారు. చండీగఢ్ మేయర్ వివాదంపై సుప్రీంకోర్టు నేడు విచారించనున్న నేపథ్యంలో ఆయన మేయర్ పదవి నుంచి తప్పుకున్నారు. అయితే అదేసమయంలో ఆప్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరడం విశేషం. దీంతో ఆ పార్టీ బలం 17కు చేరింది.
మొత్తం 35 మంది సభ్యులు కలిగిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీకి 14 మంది కౌన్సిలర్లు ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీకి 10 మంది, దాని భాగస్వామ్యపక్షమైన కాంగ్రెస్‌కు ఏడుగురు సభ్యులు ఉన్నారు. కాగా, తాజాగా చీపురు పార్టీకి చెందిన ముగ్గురు బీజేపీలో చేరడంతో వారి సంఖ్య 17కు పెరిగింది. మేయర్ పదవిని సొంతం చేసుకోవాలంటే మ్యాజిక్ నంబర్ 19 ఓట్లు రావాల్సి ఉంటుంది. అయితే బీజేపీకి శిరోమణి అకాలీదళ్‌కు చెందిన ఓ సభ్యుడు మద్దతు ప్రకటించగా, చండీగఢ్ ఎంపీ కిశోర్ ఖేర్‌కు ఎక్స్ అఫీషియో మెంబర్‌గా ఓటు వేసే అవకాశం ఉంది.

దీంతో బీజేపీ బలం మ్యాజిక్ ఫిగరైన 19కి చేరనుంది. ఈ నేపథ్యంలో మరోసారి చండీగఢ్ మున్సిపాలిటీని కాషాయ పార్టీయే చేజిక్కించుకోనున్నది. కాగా, ఈ నెల 30న జరిగిన మేయర్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తూ ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాలతో మేయర్ మనోజ్ సోన్కర్ నేడు తన పదవికి రాజీనామా చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

