Viral Video | బట్టతలతో దువ్వెన ఏం చేసుకుంటా..: వీధి వ్యాపారితో ఆకట్టుకున్న అనుపమ్ ఖేర్ సంభాషణ
Viral Video : ఓ చిరువ్యాపారితో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సంభాషణ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. రోజూ ఎంతో మందిని కలుస్తున్నా వారితో చిన్న సరదా ఘటనలు రోజంతా మనసుకు హాయినిస్తాయి.
Viral Video : ఓ చిరువ్యాపారితో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సంభాషణ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. రోజూ ఎంతో మందిని కలుస్తున్నా వారితో చిన్న సరదా ఘటనలు రోజంతా మనసుకు హాయినిస్తాయి. ముంబై వీధుల్లో రూ. 20కి దువ్వెనలు విక్రయించి పొట్టపోసుకునే రాజు అనే వీధి వ్యాపారితో అనుపమ్ ఖేర్ కొద్దిసేపు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
బట్టతల ఉన్న తనకు దువ్వెనతో అవసరం ఏముందని రాజుతో అనుపమ్ ఖేర్ సరదాగా అడగ్గా, రాజు ఆలోచనలో పడతాడు. ఆపై రాజు బర్త్‌డే అని తెలుసుకున్న అనుపమ్ ఖేర్ అతడి సంతోషం కోసం దువ్వెన కొనుగోలు చేసి డబ్బు అందచేస్తాడు. బాల్డ్ అండ్ బ్యూటిఫుల్! ముంబైలో సరదా సన్నివేశం : నేనెప్పుడూ దువ్వెన కొనాల్సిన అవసరం ఎదురుపడలేదు. అయితే రాజు బర్త్‌డే కావడంతో అతడి రోజు సంతోషంగా ప్రారంభం కావాలని అతడి నుంచి దువ్వెన కొనుగోలు చేశా అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
దువ్వెన అవసరం ఉన్నా లేకున్నా రాజుకు మద్దతుగా నిలవండని ముంబై వాసులను అనుపమ్ ఖేర్ కోరారు. కష్టాలకు వెరవక రాజు చిరునవ్వుతో స్ఫూర్తిదాయక వ్యవహార శైలి ఆకట్టుకుంటుందని అనుపమ్ ఖేర్ రాసుకొచ్చారు.
Read More :
Komuravelli | ఐదో వారం జన జాతర.. కొమురవెల్లికి పోటెత్తిన భక్తులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

