MS Dhoni | భారత క్రికెట్ జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఫ్యామిలీతో తన విలువైన సమయాన్ని గడుపుతున్నాడు. ధోనీ 2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పూర్తిగా ఐపీఎల్‌కే అంకితమయ్యాడు. ఐపీఎల్ మ్యాచ్‌లు మినహా మరే ఇతర మ్యాచుల్లోనూ ఆడటం లేదు. ఆ సమయంలో తన విలువైన సమయాన్ని ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో గడుపుతున్నాడు.
అప్పుడప్పుడు సరదాగా తన బైక్స్, కార్లలో రాంచీ (Ranchi) వీధుల్లో షికారు చేయడం, ఫ్రెండ్స్‌తో సరదాగా బయటకు వెళ్లడం వంటివి చేస్తున్నాడు. తాజాగా ధోనీ తన ఫ్రెండ్స్‌తో చిల్ అవుతున్న (Chills With Friends) ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. రాంచీలోని ఓ లోకల్ ధాబా (Local Dhaba)లో తన ఫ్రెండ్స్‌తో కలిసి లంచ్‌ను ఎంజాయ్ చేశారు. వారితో సరదాగా కాసేపు ముచ్చటించి టైమ్ స్పెండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్లో కింగ్ మేకర్‌గా పేరొందిన ధోనీ 16వ సీజన్లో సీఎస్కేను మరోసారి చాంపియన్‌గా నిలిపాడు. అందరూ ఊహించినట్టే 17వ సీజన్‌కు ముందు తాల పగ్గాలు వదిలేశాడు. తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)ను ప్రకటించి వికెట్ కీపర్‌గా కొనసాగాడు. అయితే.. అతడు మరో సీజన్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. 41 ఏండ్ల వయసులోనూ ఫిట్‌గా ఉన్న ధోనీ 18వ సీజన్లో కొత్త అవతారంలో చెన్నైకి అండగా నిలిచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ యాజమాన్యం పాత రిటెన్షన్ విధానాన్ని (Retention Policy) తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఐపీఎల్ ఆడుతున్న క్రికెటర్లను ఐదేండ్ల పాటు రీటైన్ చేసుకొనే నియమాన్ని మళ్లీ తెరపైకి రానుందని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. అదే జరిగితే.. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎంఎస్ ధోనీ మరో సీజన్ ఆడేందుకు ఏ అభ్యంతరం ఉండదు. ఐపీఎల్ పాత నిబంధన ప్రకారం ధోనీని 2026 వరకూ అట్టిపెట్టుకునే వీలుంది. అందుకని సీఎస్కే ఈ రూల్‌ను మళ్లీ తేవాలని బీసీసీఐ, ఐపీఎల్ యాజమాన్యాన్ని కోరుతోంది. దాంతో, బీసీసీఐ కూడా అందుకు సిద్దంగానే ఉన్నట్టు సమాచారం.
MS Dhoni enjoying the Sunday with his close friends ❤️ pic.twitter.com/oVZEJMECGW
— Johns. (@CricCrazyJohns) August 19, 2024
Also Read..
PM Modi: పోలాండ్, ఉక్రెయిన్ వెళ్తున్నా : ప్రధాని మోదీ
Teacher Arrest | నిన్న బద్లాపూర్.. నేడు అకోలా..! ఆరుగురు విద్యార్థినులపై టీచర్ లైంగిక వేధింపులు..