Actress Sarada: ఫిల్మ్ ఇండస్ట్రీ మహిళలు అలాంటి దుస్తులు వేసుకోవడం సరికాదు: హేమా కమీషన్లో నటి శారద అభిప్రాయం
Actress Sarada: నేటి తరం ఫిల్మ్ ఇండస్ట్రీ మహిళలు వేసుకుంటున్న డ్రెస్సుల పట్ల అలనాటి నటి ఊర్వశి శారద అభ్యంతరం వ్యక్తం చేశారు. మలయాళ ఫిల్మ్ పరిశ్రమపై హేమా కమీషన్ ఇచ్చిన రిపోర్టులో ఆమె ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తిరువనంతపురం: మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలకు వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. ఆ అంశాన్ని స్టడీ చేసేందుకు కేరళ సర్కారు హేమా కమీషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమీషన్ మంగళవారం తన నివేదికను సీఎం విజయన్‌కు సమర్పించింది. దాంట్లో సభ్యురాలు అయిన నటి ఊర్వశి శారద(Actress Sarada) కొన్ని కీలక సూచనలు చేసింది. తెలుగు చిత్రాల్లోనూ నటించిన శారద ఆ రిపోర్టులో మహిళల దస్తులు విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమకు చెందిన మహిళలు నేటి రోజుల్లో ధరిస్తున్న దుస్తులు సరిగా ఉండడం లేదని నటి శారద పేర్కొన్నారు. శరీరాన్ని దాచి పెట్టడం కన్నా.. వాళ్లు వేసుకుంటున్న దుస్తులు.. శరీర భాగాలను మరింతగా చూపిస్తున్నట్లుగా ఉందని అలనాటి నటి శారద తెలిపారు.
హేమా కమీషన్లో ముగ్గురు సభ్యులు ఉన్నారు. దాంట్లో నటి శారద ఒకరు. సినిమాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రాక్టికల్ సమస్యలు ఉన్నట్లు ఆమె చెప్పారు. సినిమాకు చెందిన టెక్నికల్ అంశాల్లో మహిళల పాత్ర అవసరం లేదన్న విషయాన్ని ఆమె వెల్లడించారు. లైంగిక వేధింపుల అంశం గురించి నటి శారద ప్రస్తావిస్తూ.. నేటి రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో మహిళలు వేసుకుంటున్న డ్రెస్సింగ్ సరిగా ఉండడం లేదన్నారు. పాత కాలంలో సెట్స్ వద్ద డబుల్ మీనింగ్ సంభాషణలు ఉండేవి కాదు అని, అలాగే సెట్స్ వద్ద లైంగిక దాడులు కూడా ఉండేవి కాదన్నారు. కనీసం ఎవరూ తాకేవారు కాదన్నారు. నటులు, జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లను ఎవరూ టచ్ చేసేవారు కాదన్నారు. ప్రస్తుత కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి వేధింపులు ఉండవని చెప్పలేమన్నారు.
మన సమాజంపై పశ్చిమ సంస్కృతి ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ఇప్పుడున్న సమాజాన్ని అప్పటితో పోల్చలేమన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా కలిసిపోతున్నారని, గర్ల్‌ఫ్రెండ్స్, బాయ్‌ఫ్రెండ్స్ అనేది చాలా పబ్లిక్‌గా మారిందన్నారు. కొత్త జనరేషన్ కల్చరే వేరుగా ఉందన్నారు. చాలా ఈజీగా కాంప్రమైజ్ అవుతున్నారని, ఇది ఓపెన్‌గా జరుగుతోందన్నారు. నేటి తరం మహిళలు చదువుకున్నారని, వాళ్లు తమ హక్కుల గురించి పోరాడుతున్నారని, ప్రొడ్యూసర్‌కు వాళ్ల వల్ల ఎటువంటి సమస్య రావద్దు అని ఆమె అభిప్రాయపడ్డారు. కేవలం ప్రమాదాలకు గురైన వారికి సాయం చేయాలని, డెలివరీ, చైల్డ్‌కేర్ కోసం వెళ్లే మహిళలకు సాయం అవసరం లేదన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.
రిటైర్డ్ హైకోర్టు జడ్జి కే హేమా.. ఆ కమీషన్‌కు నాయకత్వం వహించారు. నటి శారదతో పాటు మాజీ సివిల్ సర్వీస్ అఫిషియల్ కేబీ వాత్సల కుమారి ఆ కమీషన్లో సభ్యులుగా ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

