చెన్నై: ఐపీఎల్లో ఎప్పుడూ లేని విధంగా టోర్నీ తొలి మూడు మ్యాచ్‌లలో గెలిచింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). ప్రస్తుతం పాయింట్లు టేబుల్లో టాప్‌లో ఉంది. చెన్నైలో మ్యాచ్‌లు ముగించుకొని ఇప్పుడు ముంబైకి బయలుదేరింది. అయితే చెన్నై నుంచి ముంబై వెళ్లే ఫ్లైట్‌లో ఆ టీమ్‌ను ఎంటర్టైన్ చేశాడు కమెడియన్ డానిష్ సైత్. మిస్టర్ నాగ్స్‌గా పేరుగాంచిన అతడు ఫ్లైట్‌లో ఆర్సీబీ ప్రెజెంటర్, హోస్ట్‌గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా అతడు కెప్టెన్ కోహ్లిపై పంచ్‌లు వేశాడు.
ఈ ఫ్లైట్ 90 నిమిషాల్లో ముంబై వెళ్తుంది. ఆలస్యమైతే కెప్టెన్‌కు ఫైన్ వేద్దాం. అతనికిది అలవాటే అంటూ స్లో ఓవర్ రేట్లో కోహ్లికి జరిమానాలు పడిన విషయాన్ని గుర్తు చేస్తూ మిస్టర్ నాగ్స్ పంచ్ వేశాడు. అంతేకాదు ఐపీఎల్లో ఎప్పుడూ బెంగళూరు ఇలా టాప్‌లో లేదు. ఇక చాలు. దీనిని ఇలా ముగిద్దాం. ముంబైకి వద్దు ఇటు నుంచి ఇటే బెంగళూరుకు వెళ్లిపోదాం. ఇక టోర్నీలో ఆడొద్దు అంటూ కోచ్, కెప్టెన్ సహా టీమ్‌లోని ప్రతి ప్లేయర్ దగ్గరికీ వెళ్లి అతడు అనడం చాలా ఫన్నీగా ఉంది. చివరికి అతని బాధను తట్టుకోలేక టీమంతా కలిసి అతన్ని ఫ్లైట్‌లోని బాత్రూమ్లో వేసి లాక్ చేసేయడం నవ్వు తెప్పిస్తుంది. ఈ వీడియోను ఆర్సీబీ టీమ్ ట్విటర్లో పోస్ట్ చేసింది.
RCB Insider: Travel Diaries with Nags
— Royal Challengers Bangalore (@RCBTweets) April 20, 2021
After ticking the right boxes in Chennai, Team RCB had to fly to Mumbai for the next leg of #IPL2021. Mr. Nags, however, had different ideas…
Watch @myntra presents RCB Insider and enjoy another fun ride.#PlayBold #WeAreChallengers pic.twitter.com/b0SutT4P2y
ఇవి కూడా చదవండి
మార్స్‌పై నాసా హెలికాప్టర్ వెనుక మనోడు
వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం ఎత్తివేత!
ఏప్రిల్ 30 వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ
కరోనాతో చెస్ ఆడుతున్నాం.. ఎవరు గెలుస్తారో చూద్దాం: ఎయిమ్స్ చీఫ్
IPL 2021: వాషింగ్టన్, పడిక్కల్ దశ తిరిగింది.. ప్యూమాతో ఒప్పందం
IPL 2021: 40 ఏళ్ల వయసులో బాగా ఆడతానని గ్యారెంటీ ఇవ్వలేను: ధోనీ
కాస్త తగ్గాయి.. 24 గంటల్లో 2,59,170 కేసులు.. 1761 మరణాలు