Morne Morkel : భారతీయ వంటకాల రుచికి మైమరచిపోయిన విదేశీ యాత్రికులు ఎందరో. ముఖ్యంగా భారత పర్యటనకు వచ్చే క్రికెటర్లు మనదేశ రెసిపీలకు ఫిదా అవుతుంటారు. ఎప్పుడు ఇండియా వచ్చినా సరే లొట్టలేసుకుని మరీ భారతీయ ఆహారాన్ని ఆరగిస్తారు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్(Morne Morkel) కూడా చేరాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు కోసం మోర్కెల్ చెన్నైలో భారత జట్టు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. అనంతరం మోర్కెల్ మాట్లాడుతూ భారతీయ వంటకాలంటే తనకు చాలా ఇష్టమని అన్నాడు.
‘ఇండియన్ ఫుడ్‌లో నాకు దోశ, పంజాబీ వంటకాల్లో ఫేమస్ అయిన మలాయ్ చికెన్(Malai Chicken) అంటే చాలా ఇష్టం. ఈ రెండింటినీ మనసారా ఆస్వాదిస్తాను. బ్రేక్‌ఫాస్ట్‌గా పూరీ ఉన్నా అవురావురుమంటూ లాగించేస్తాను. ఇంకా.. నాన్ బ్రెడ్‌ను కూడా వదలను. అయితే.. కోచ్‌గా ఆరోగ్యకరమైన ఆహారం తినడం చాలా ముఖ్యం. అప్పుడే కదా ఇతరులు నన్ను చూసి నేర్చుకుంటారు’ అని మోర్కెల్ తెలిపాడు.
టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కోచింగ్ బృందం మొత్తం మారింది. హెడ్‌కోచ్‌గా ఎంపికైన గౌతం గంభీర్(Gautam Gambhir) సొంత జట్టును ఏర్పాటు చేసుకున్నాడు. అందులో భాగంగానే ఐపీఎల్లో కలిసి ఆడిన మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా తీసుకోవాల్సిందిగా బీసీసీఐని ఒప్పించాడు. అయితే.. శ్రీలంక పర్యటనకు జట్టుతో కలవలేకపోయిన ఈ సఫారీ దిగ్గజం బంగ్లాదేశ్ పర్యటనకు ముందే భారత్‌కు వచ్చేశాడు.
⏪ Feeling after being named Bowling Coach
🏏 Goals for an exciting home season
🍲 Savouring Indian Food 😃𝗜𝗻𝘁𝗿𝗼𝗱𝘂𝗰𝗶𝗻𝗴 #𝗧𝗲𝗮𝗺𝗜𝗻𝗱𝗶𝗮 𝗕𝗼𝘄𝗹𝗶𝗻𝗴 𝗖𝗼𝗮𝗰𝗵 – 𝗠𝗼𝗿𝗻𝗲 𝗠𝗼𝗿𝗸𝗲𝗹 🙌 – By @RajalArora
WATCH 🎥🔽 #INDvBAN | @mornemorkel65 | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) September 14, 2024
చెన్నైలో తొలి ప్రాక్టీస్ సెషన్ తర్వాత మోర్కెల్ భారత్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘ఇక్కడున్న వాళ్లలో చాలా మందితో కలిసి నేను ఐపీఎల్ ఆడాను. ఆ సమయంలో మా మధ్య స్నేహం ఏర్పడింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే.. ఇప్పుడు జట్టులోని ప్రతి ఒక్కరి బలాలు, బలహీనతలు అంచనా వేయడం చాలా ముఖ్యం. వాళ్లకు అవసరమైన తోడ్పాడు అందించడమే నా పని’ అని మోర్కెల్ వెల్లడించాడు. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య సెప్టెంబర్ 19వ తేదీన చెన్నైలో తొలి టెస్టు జరుగనుంది.