Asian Champions Trophy: హాకీలో హర్మన్‌ప్రీత్ షో.. పాకిస్థాన్‌పై ఇండియా విక్టరీ
Asian Champions Trophy: ఏషియన్ హాకీ ట్రోఫీలో.. పాకిస్థాన్‌పై ఇండియా విజయం నమోదు చేసింది. 2-1 గోల్స్ తేడాతో హర్మన్‌ప్రీత్ బృందం విక్టరీ కొట్టింది. దీంతో టోర్నీలో ఓటమి లేకుండానే ఇండియా జట్టు సెమీస్‌లోకి ప్రవేశించింది.
చైనా: ఏషియన్ హాకీ చాంపియన్‌షిప్(Asian Champions Trophy)లో టీమిండియా .. లీగ్ దశను అజేయంగా ముగించింది. ఇవాళ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో ఇండియా విక్టరీ నమోదు చేసింది. ఏడవ నిమిషంలో పాక్ ప్లేయర్ అహ్మద్ నదీమ్ గోల్ చేశాడు. అయితే ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ సింగ్.. రెండు గోల్స్ చేసి ఇండియా జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఏషియన్ టోర్నీలో ఇప్పటికే భారత జట్టు సెమీస్‌కు చేరింది.
ఆట 13వ నిమిషంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తన డ్రాగ్‌ఫ్లిక్‌తో తొలి గోల్ చేశాడు. మళ్లీ 19వ నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్ ను డ్రాగ్‌ఫ్లిక్‌తో రెండో గోల్ చేశాడతను. రెండు గోల్స్‌తో టీమిండియా లీడింగ్‌లో ఉన్నా.. బలమైన పాకిస్థాన్ ఆద్యంతం విరోచితంగా పోరాడింది. అయితే ఓ దశలో పాక్ ప్లేయర్ అష్రఫ్ రాణా దురుసుగా ప్రవర్తించాడు. ప్రవర్తన సరిగాలేకపోవడంతో.. టీవీ అంపైర్ అతనికి ఎల్లో కార్డు జారీ చేశాడు. చివరలో రెండు జట్లూ కేవలం పది మంది ఆటగాళ్లతో ఆడారు.
Captain Harmanpreet Singh leads Team India to yet another famous victory against Pakistan. 🥳💪🏻
2️⃣ penalty corners scored in the first half were enough to win this game after Pakistan took the lead in the game in Q1.
Next up Semi Final on Monday. More details to follow.… pic.twitter.com/NWpH5si6aT
— Hockey India (@TheHockeyIndia) September 14, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

