Mohammad Shami : భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (Mohammad Shami) ఆటకు దూరమై 8 నెలలు కావొస్తోంది. లండన్‌లో కాలి మడమ సర్జరీ (Ankle Surgery) చేయించుకున్న ఈ స్పీడ్‌స్టర్ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో కోలుకొని ఫిట్నెస్ సాధించాడు. అయితే.. భారత జట్టులోకి ఎంట్రీ ఎప్పుడు? అని మీడియా అడిగిన ప్రశ్నకు షమీ ఆసక్తికర సమాధానం చెప్పాడు. కోల్‌కతాలోని బెంగాల్ క్లబ్లో మాట్లాడుతూ.. పునరాగమనం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపాడు.
‘నేను ఎప్పుడు పునరాగమనం చేస్తాను అనేది చెప్పడం కష్టమే. మళ్లీ మైదానంలో దిగేందుకు నేను ఎంతగానో శ్రమిస్తున్నా. భారత జట్టు జెర్సీ కంటే ముందు మీరు నన్ను త్వరలోనే బెంగాల్ జట్టు జెర్సీలో చూస్తారు అని షమీ వెల్లడించాడు. బెంగాల్ తరఫున రెండు మూడు మ్యాచ్‌లు ఆడుతా. ఆ తర్వాత పూర్తి ఆత్మవిశ్వాసంతో టీమిండియాలోకి వస్తాను’ అని ఈ పేసర్ వివరించాడు.
వన్డే ప్రపంచ కప్ తర్వాత సర్జరీ చేయించుకున్న షమీ దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమయ్యాడు. ఎన్సీలో రిహాబిలిటేషన్‌లో ఉన్న షమీ పూర్తిగా ఫిట్నెస్ సాధించకపోవడంతో ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో సైతం ఆడలేకపోయాడు.
నిరుడు స్వదేశీ గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో షమీ అద్భుతంగా రాణించాడు. బుల్లెట్ బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన షమీ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. నవంబర్ 29న జరిగిన టైటిల్ పోరులోనూ షమీ మూడు వికెట్లు తీసినా.. ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీతో ఆసీస్‌ను గెలిపించాడు.
వరల్డ్ కప్‌లో 24 వికెట్లతో పాటు.. 2023లో అత్యుత్తమంగా రాణించిన షమీని ప్రతిష్ఠాత్మక అర్జున(Arjuna) అవార్డు వరించింది. రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అతడు ఈ అవార్డు స్వీకరించాడు.