లక్నో: ప్రసిద్ధ కట్టడమైన తాజ్‌మహల్ లోపల గంగా జలంతో అభిషేకం నిర్వహించేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. (offering ‘Gangajal’ at Taj Mahal) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అప్రమత్తమైన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని తాజ్ మహల్ స్మారక చిహ్నం కాదని శివాలయమని, తేజోమహలే అని హిందూ వర్గాలు వాదిస్తున్నాయి. అక్కడ పూజలు, అభిషేకాల కోసం కోర్టును ఆశ్రయించాయి.
కాగా, అఖిల భారత హిందూ మహాసభకు చెందిన ఇద్దరు వ్యక్తులు శనివారం పర్యాటకుల మాదిరిగా తాజ్ మహల్లోకి ప్రవేశించారు. వాటర్ బాటిల్లో గంగా జలాన్ని తెచ్చారు. శ్రావణ మాసం సందర్భంగా అభిషేకం నిర్వహించేందుకు ప్రయత్నించారు. షాజహాన్, ముంతాజ్ మహల్ సమాధులు ఉన్న తాజ్ మహల్‌లోని నేలమాళిగకు దారితీసే మూసి ఉన్న మెట్లపై ఒక వ్యక్తి గంగా జలాన్ని పోశాడు. ఆ మెట్ల వద్ద ఓం పేరుతో స్టిక్కర్ ఉందని, అందుకే గంగా జలంతో అక్కడ అభిషేకం చేసినట్లు ఆ వ్యక్తులు వాదించారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులకు వారిని అప్పగించారు. దీంతో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని, వారి చర్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. కాగా, తాజ్ మహల్ లోపల బాటిల్ నుంచి గంగా జలం పోస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
इन बेवकुफो को कोई समझाओ कीं सावन में गंगा जल शिवलिंग पर चढ़ाया जाता है ना कीं कब्र पर
आगरा :ताजमहल के अंदर कब्र पर अखिल भारत हिन्दू महासभा के कार्यकर्ताओं ने गंगाजल चढ़ाया।#tajmahal pic.twitter.com/6s0vDrc0CO
— Gaurav Yadav (@ygauravyadav) August 3, 2024