Nara Bhuvaneshwari | శ్రీశైలం : ఏపీ సీఎం నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న భువనేశ్వరికి ఆలయ ఈఓ పెద్దిరాజు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. రాజగోపురం వద్ద ధ్వజస్తంభం వద్ద పూజలు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఏఈఓ హరిదాస్ స్వామివారి శేషవస్త్రం, స్వామి అమ్మవార్ల చిత్రపటాలు, తీర్థ ప్రసాదాలు అందించగా.. వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. భువనేశ్వరి వెంట శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్రెడ్డి సతీమణి ఉన్నారు.
Bhuvaneshwari 01