Mohammad Shami : వన్డే వరల్డ్ కప్‌లో భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ(Mohammad Shami)అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థుల భరతం పట్టాడు. బుల్లెట్ లాంటి బంతులతో వికెట్ల వేట కొనసాగించిన షమీ.. ఈసారి తనలోని మానవత్వం చాటుకున్నాడు. ఈ స్టార్ స్పీడ్‌స్టర్ నైనిటాల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడాడు. తమ ముందు వెళ్తున్న ఒక కారు కింద పడిపోవడం గమనించిన షమీ వెంటనే తన కారు ఆపి అతడిని రక్షించాడు.
దీనికి సంబంధించిన వీడియోను షమీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘ఇతడు చాలా అదృష్టవంతుడు. దేవుడు అతడికి రెండు జీవితాలు ఇచ్చాడు. నైనిటాల్లో ఘాట్ రోడ్డు మీదుగా మా కారు ముందు వెళ్తున్న కారు కింద పడి పోయింది. అతడిని మేము సురక్షితంగా బయటకు తీసుకొచ్చాం’ అని షమీ క్యాష్షన్ రాసుకొచ్చాడు.
వన్డే ప్రపంచ కప్‌లో ఇరగదీసిన షమీ టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఈ స్పీడ్ష్టర్ 7 మ్యాచుల్లోనే 24 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) గాయపడడంతో తుదిజట్టులోకి వచ్చిన షమీ తానేంటో నిరూపించాడు. ఆడిన తొలి మ్యాచ్ నుంచే భారత ప్రధాన అస్త్రంగా మారిన షమీ ప్రత్యర్థులను వణికించాడు. దాంతో, కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడిని పక్కనపెట్టాలన్న ఆలోచన చేయలేదు. ఫైనల్లోనూ రెండు కీలక వికెట్లతో షమీ బ్రేక్ ఇచ్చినా.. ట్రావిస్ హెడ్(137), మార్నస్ లబూషేన్(58 నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాను గెలిపించారు.