క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్(Kohli Retirement) ప్రకటించిన విషయం తెలిసిందే. డ్యాషింగ్ బ్యాటర్ కోహ్లీ రిటైర్మెంట్పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. ఓ అసాధారణ టెస్టు ప్రయాణం ముగిసిందన్నారు. భారతీయ క్రికెట్ ను కొత్త దశకు తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. తన ఎక్స్ అకౌంట్లో హరీశ్ రావు స్పందిస్తూ.. విరాట్ కోహ్లీ దీక్షను, నాయకత్వాన్ని ప్రశంసించారు. టెస్టుల్లో ఎన్నో మధుర స్మృతులను అందించినందుకు ఆయన థ్యాంక్స్ తెలిపారు. వన్డేల్లో సక్సెస్ కొనసాగాలని ఆశిస్తున్నట్లు ఎమ్మెల్యే హరీశ్ వెల్లడించారు.
A remarkable Test journey comes to an end. @imVkohli redefined Indian cricket with his intensity, commitment, and leadership.
Thank you for the unforgettable moments in whites. Wishing him continued success in ODIs.#ViratKohli pic.twitter.com/sgKT3QmfXD
— Harish Rao Thanneeru (@BRSHarish) May 12, 2025
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా కోహ్లీ రిటైర్మెంట్పై రియాక్ట్ అయ్యారు. థ్యాంక్యూ.. కింగ్ కోహ్లీ అని ఆమె తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. టెస్టుల్లో అరంగేట్రం చేసిన క్షణం నుంచీ.. అత్యంత సక్సెస్ఫుల్ టెస్టు కెప్టెన్‌గా కోహ్లీ అవతరించారని, మేటి బ్యాటర్‌గా రాణించారని, కేవలం క్రికెట్ ఆడడమే కాదు, ఆ గేమ్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని కవిత తెలిపారు. టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన క్షణం.. కోహ్లీ కేవలం రికార్డలను వదిలి వెళ్లడం లేదని, విశ్వాసం… ఆధిపత్యం.. క్రీడాస్పూర్తిని వదిలి వెళ్లారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.
Thank you, King Kohli!
From that debut in whites to becoming one of the most successful Test captains and iconic batters of generations, Virat Kohli didn’t just play the game of cricket, he elevated it.
As he bids farewell to Test cricket, he leaves behind not just a record,… pic.twitter.com/1frMqop0Td
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 12, 2025
123 టెస్టులు ఆడిన కోహ్లీ.. 9230 రన్స్ చేశాడు. కోహ్లీ టెస్టు కెరీర్లో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 అత్యధిక స్కోరు.
Overall, Virat Kohli finished as fourth-highest run-getter for India in Tests, scoring 9230 runs from 123 Tests at an average of 46.85, hitting 30 hundreds and 31 fifties, bringing the curtains down on a glorious career. 🫡 🙌#TeamIndia | #ViratKohli | @imVkohli pic.twitter.com/vTJiKnBYvG
— BCCI (@BCCI) May 12, 2025