IND vs NZ : సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. పవర్ ప్లేలోనే ఓపెనర్లు ఔటైనా.. డారిల్ మిచెల్(137) క్రీజులో పాతుకుపోయాడు. విల్ యంగ్ ఔటయ్యాక.. గ్లెన్ ఫిలిప్స్(106) జతగా భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు మిచెల్. మిడిల్ ఓవర్లలో నింపాదిగా ఆడిన ఆ ద్వయం.. తర్వాత రెచ్చిపోయారు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి స్కోర్ బోర్డును ఉరికించారు. అయితే.. సెంచరీ తర్వాత ఒకరివెనుక ఒకరు పెవిలియన్ చేరారు. 45 ఓవర్లకు స్కోర్.. 285-5
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఆరంభంలో తడబడినా.. ఆ తర్వాత పుంజుకంది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే అర్ష్దీప్ సింగ్ సూపర్ డెలివరీతో ఓపెనర్ హెన్రీ నికోల్స్(0)ను బౌల్డ్ చేశాడు. ఫామ్లోలేని డెవాన్ కాన్వే(5)ను మళ్లీ హర్షిత్ రానానే పెలిలియన్ పంపాడు. 5 పరుగులకే రెండు వికెట్లు పడిన వేళ.. నేనున్నాగా అంటూ డారిల్ మిచెల్(137) ఆపద్భాదంవుడి పాత్ర పోషించాడు.
Most hundreds vs India in India in men’s ODIs:
AB de Villiers: 5 💯s in 11 innings
Daryl Mitchell: 4 💯s in 8 innings 💥 #INDvNZ pic.twitter.com/9hn6QmibAT— ESPNcricinfo (@ESPNcricinfo) January 18, 2026
విల్ యంగ్(30)తో కలిసి పవర్ ప్లేలో మరో వికెట్ పడకుండా ఆడిన అతడు.. ఆ తర్వాత తన స్టయిల్ విధ్వంసంతో భారత బౌలర్లను భయపెట్టాడు. గ్లెన్ ఫిలిఫ్స్(106)తో కలిసి 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడీ చిచ్చరపిడుగు. పవర్ హిట్టింగ్తో అలరించిన ఫిలిప్స్ 83 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. వన్డేల్లో అతడికిది రెండో వంద. కాసేపటికే అర్ష్దీప్ సింగ్ ఓవర్లో అతడు కీపర్ రాహుల్ చేతికి చిక్కాడు. అనంతరం సిరాజ్ ఓవర్లో కుల్దీప్ చేతికి మిచెల్ కూడా దొరకగా.. భారత బౌలర్లు ఊపిరిపీల్చుకున్నారు.