IPL Retention : ఇండియన్ ప్రీమియర్ 17వ సీజన్ మినీ వేలంలో రికార్డు ధర పలికిన ఆస్టేలియా స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc)కు ఊహించని అనుభవం ఎదురైంది. అతడిపై కోట్లు కుమ్మరించిన కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) ఈసారి అట్టిపెట్టుకోలేదు. అయితే.. కనీస సమాచారం లేకుండా తనను కోల్‌కతా వదిలేసిందని మిస్సైల్ స్టార్క్ మండిపడుతున్నాడు.
ఫైనల్లో సంచలన స్పెల్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాపార్డర్‌ను కూల్చిన స్టార్క్ కోల్‌కతా విజయంలో కీలక పాత్రం పోషించాడు. అయితేనేమీ అన్నట్టు.. మెగా వేలాన్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యం ఆసీస్ స్పీడ్‌గన్‌ను వదులుకుంది. ‘రిటైన్ జాబితా తయారీకి ముందు ఎవరూ నాకు ఏ విషయం చెప్పలేదు. ఒక్క మాటైనా అడగకుండా వదిలేశారు. ఫ్రాంచైజీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నా’ అని స్టార్క్ వెల్లడించాడు. 17వ సీజన్లో మొదటి రెండు మూడు మ్యాచుల్లో తేలిపోయిన స్టార్క్ ఆ తర్వాత కీలక మ్యాచుల్లో నిప్పులు చెరిగాడు. ఎలమినేటర్ 1, ఫైనల్లో తన జోరు చూపించి కోల్‌కతా మూడో టైటిల్ ముద్దాడడంలో భాగమయ్యాడు.
— KolkataKnightRiders (@KKRiders) November 2, 2024
అయితే.. జట్టు కూర్పుతో పాటు స్క్వాడ్‌లో మార్పులు అనివార్యమని భావించిన యజమాన్యం నమ్మదగ్గవాళ్లనే అట్టిపెట్టుకుంది. ఫినిషర్ రింకూ సింగ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఆల్‌రౌండర్లు ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్‌లతో పాటు యువకెరటాలు రమన్‌దీప్ సింగ్, హర్షిత్ రానాలను కోల్‌కతా రిటైన్ చేసుకుంది. ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీ జేబులో రూ.51 కోట్లు ఉన్నాయంతే.
Here are your retained Knights 💜
Next Stop: #TATAIPLAuction 💰🔨 pic.twitter.com/fvr1kwWoYn
— KolkataKnightRiders (@KKRiders) October 31, 2024
లెఫ్టార్మ్ పేసర్ అయిన స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికాడు. రూ.24.75 కోట్లతో తన సహచరుడు ప్యాట్ కమిన్స్(రూ.20.5 కోట్లు) రికార్డును బద్ధలు కొట్టాడు. రూ. 2 కోట్ల కనీస ధర ఉన్న ఈ యార్కర్ కింగ్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), గుజరాత్ టైటాన్స్ చివరిదాకా పోటీ పడ్డాయి. కానీ, చివరకు కోల్‌కతా భారీ ధరకు స్టార్క్‌ను కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్(Daryl Mitchell) రూ.14 కోట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
Presenting the Top 5⃣ buys of #IPLAuction 2024 😎
Mitchell Starc tops the list with a whopping amount of INR 24.75 Crore 🔥#IPL pic.twitter.com/3ky8QsixV1
— IndianPremierLeague (@IPL) December 19, 2023
1. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) – రూ.24.75 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్
2. ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – రూ.20.5 కోట్లు – సన్‌రైజర్స్ హైదరాబాద్
3. డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) – రూ. 14 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
4. హర్షల్ పటేల్ (భారత్) – రూ.11.75 కోట్లు – పంజాబ్ కింగ్స్
5. అల్జారీ జోసెఫ్ (వెస్టిండీస్) – రూ. 11. 50 కోట్లు – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
నవంబర్‌లో ఆస్ట్రేలియా సొంతగడ్డపై బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాతో తలపడనుంది. ఈ సిరీస్‌లో యార్కర్ కింగ్ స్టార్క్ కీలకం కానున్నాడు. నవంబర్ 22న పెర్త్ వేదికగా ఇండియా, ఆసీస్‌లు తొలి టెస్టు ఆడనున్నాయి. మరో విషయం ఏంటంటే 1999 తర్వాత తొలిసారి బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీని ఐదు టెస్టుల మ్యాచ్‌గా నిర్వహిస్తుండడం విశేషం.