IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్ ఆద్యంతం అదరగొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) చాంపియన్‌గా నిలిచింది. ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా సమిష్టితత్త్వాన్ని నమ్ముకున్న కోల్‌కతా మూడో టైటిల్‌ను ముద్దాడింది. పర్పుల్ జెర్సీ జట్టు ట్రోఫీ విజయంలో కీలకమైన స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc)ను ఎంత పొగిడినా తక్కువే. చెపాక్‌లో సంచలన బౌలింగ్ ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) నడ్డి విరిచిన స్టార్క్.. తనపై రూ.24.75కోట్లు పెట్టిన కోల్‌కతా విజయానికి నాంది పలికాడు.
దుబాయ్‌లో జరిగిన మినీ వేలంలో రికార్డు ధరకు తనను కొన్న ఫ్రాంచైజీకి ఈ స్పీడ్‌స్టర్ విలువైన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. పదిహేడో సీజన్ అరంభంలో మిస్సైల్ స్టార్క్ తీవ్ర నిరాశపరిచాడు. తొలి రెండు మ్యాచుల్లో 12 ఎకానమీతో వంద పరుగులు సమర్పించుకున్నాడు. పైగా ఒక్క వికెట్ తీస్తే ఒట్టు. ఆ సమయంలో ఇతడిపై అన్ని కోట్లు ఖర్చు పెట్టినందుకు కోల్‌కతా మేనేజ్మెంట్ తలలు పట్టుకుంది. కానీ, రెండు మ్యాచ్‌ల తర్వాత జట్టులోకి వచ్చిన స్టార్క్ తన పేస్ పవర్ చూపించాడు.
వాంఖడేలో ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను వణికించిన ఈ స్పీడ్‌స్టర్ తన ఫామ్ చాటుకున్నాడు. స్టాండ్స్‌లో కూర్చున్న భార్య అలీసా హేలీ(Alyssa Healy) మద్దతుతో రెచ్చిపోయిన స్టార్క్.. నా లుగు వికెట్లతో కోల్‌కతాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
లీగ్ దశ ఆఖర్లో లయ అందుకున్న స్టార్క్ ప్లే ఆఫ్స్‌లో పెట్రేగిపోయాడు. క్వాలిఫయర్ 1లో సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(0)ను సున్నాకే బౌల్డ్ చేసి కోల్‌కతాకు బ్రేకిచ్చాడు. ఆ తర్వాత మరో రెండు వికెట్లు తీసి హైదరాబాద్ ఫైనల్ బెర్తుకు అడ్డుపడ్డాడు. ఆ తర్వాత చెపాక్‌లో జరిగిన ఫైనల్లో అయితే.. స్టార్క్ ఓ రేంజ్లో విజృంభించాడు. తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ(2)ను ఔట్ స్వింగర్‌తో బౌల్డ్ చేసి సన్‌రైజర్స్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు.
Ball of the season? 👀🤌pic.twitter.com/fnl7oWkhQb
— KolkataKnightRiders (@KKRiders) May 26, 2024
ఆ తర్వాత మళ్లీ బంతి అందుకున్న అతడు రాహుల్ త్రిపాఠి(9)ను వెనక్కి పంపి కోల్‌కతాను పోటీలోకి తెచ్చాడు. టైటల్ పోరులో సూపర్ స్పెల్‌తో ఆకట్టుకున్న స్టార్క్ తన సత్తాను శంకించిన వాళ్లు నోళ్లు మూయించాడు. హైదరాబాద్ నిర్దేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 10.3 ఓవర్లోలనే ఊదేసింది. వెంకటేశ్ అయ్యర్(52 నాటౌట్), రహ్మనుల్లా గుర్బాజ్(39)లు బౌండరీలతో విరుచుకుపడడంతో.. 8 వికెట్ల తేడాతో కోల్‌కతా విజయఢంకా మోగించింది.
POV: You won the trophy with KKR 💜 pic.twitter.com/r33WzcfaAC
— KolkataKnightRiders (@KKRiders) May 27, 2024