T20 World Cup 2024 | స్టార్ ఆల్‌రౌండర్‌కు గాయం.. విండీస్ స్క్వాడ్‌లో భారీ మార్పులు
T20 World Cup 2024 : అమెరికాతో కలిసి స్వదేశంలో మెగాటోర్నీకి ఆతిథ్యమిస్తున్న వెస్టిండీస్ (West Indies)కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ (Jason Holder) గాయంతో ప్రపంచ కప్ ఈవెంట్‌కు దూరమయ్యాడు.
T20 World Cup 2024 : ఐపీఎల్ పండుగ కోలాహలం ముగిసింది. మరో ఐదు రోజుల్లో టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024) అభిమానులను అలరించనుంది. అమెరికాతో కలిసి స్వదేశంలో మెగాటోర్నీకి ఆతిథ్యమిస్తున్న వెస్టిండీస్ (West Indies)కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ (Jason Holder) గాయంతో ప్రపంచ కప్ ఈవెంట్‌కు దూరమయ్యాడు. దాంతో, అతడి స్థానంలో ఒబెడ్ మెక్కాయ్ (Obed McCoy)ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.
‘మా బృందంలో జేసన్ ఎంతో అనుభవజ్ఞుడైన ఆటగాడు. అతడు జట్టుతో లేకపోవడం బాధాకరమే. మైదానంలో, డ్రెస్సింగ్ రూమ్‌లో జేసన్ లేని లోటు స్పష్టంగా కనిపించనుంది. హోల్డర్ తొందరగా ఫిట్‌గా మారి త్వరలోనే జట్టుతో కలవాలని కోరుకుంటున్నాం. అయితే.. ఒబెడ్ మెక్కాయ్ సామర్థ్యం పట్ల మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ అవకాశం అతడికి భవిష్యత్‌లో ఎంతో ఉపయోగపడనుంది. అతడు మా బృందంలో కొత్త ఎనర్జీని తీసుకొస్తాడని భావిస్తున్నాం’ అని చీఫ్ సెలెక్టర్ దేశ్మాండ్ హేన్స్(Deshmond Haynes) ఓ ప్రకటనలో తెలిపాడు.
🚨 BREAKING NEWS🚨
🔹Obed McCoy replaces Jason Holder in the West Indies T20 World Cup Squad
🔹Reserves confirmedGet the details⬇️https://t.co/un4Sm5NlhU #WIREADY #T20WorldCup pic.twitter.com/oH450oh9Dy
— Windies Cricket (@windiescricket) May 26, 2024
వెస్టిండీస్ స్క్వాడ్ : రొవ్మన్ పావెల్(కెప్టెన్), అల్జారీ జోసెఫ్(వైస్ కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్‌మైర్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, నికోలసన్ పూరన్, షాహ్ హోప్, ఆండ్రూ రస్సెల్, రొమారియో షెపర్డ్, ఒబెడ్ మెక్కాయ్, అకీల్ హొసేన్, గుడకేశ్ మోతీ, షెర్ఫానే రూథర్‌ఫర్డ్.
ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లు : కైల్ మేయర్స్, మాథ్యూ ఫొర్డె, ఫాబియన్ అల్లెన్, హేడెన్ వాల్ష్ జూనియర్, ఆండ్రె ఫ్లెచర్.

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వెస్టిండీస్‌కు గొప్ప రికార్డు ఉంది. డారెన్ సమీ నేతృత్వంలో కరీబియన్ జట్టు రెండు(2012, 2016) సార్లు చాంపియన్‌గా నిలిచింది. పొట్టి ఫార్మాట్ అంటేనే పూనకాలు వచ్చినట్టు చెలరేగే విండీస్ హిట్లర్లు ఈసారి తమ పవర్ చూపేందుకు ఎదురుచూస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ జూన్ 1న ఆరంభం కానుంది. అంతకంటే ముందు వామప్ మ్యాచ్ ఆడనుంది. జూన్ 2 న జరిగే తొలి పోరులో పపువా న్యూగినియాతో కరీబియన్ జట్టు ఢీకొననుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

