హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర క్రీడా, పర్యాటక, యువజన సర్వీసులపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్పోర్ట్స్ కిట్ల పంపిణీ, సీఎం కప్ క్రికెట్ టోర్నీ నిర్వహణ, స్టేడియాల నిర్మాణం పూర్తిచేయడంపై అధికారులను మంత్రి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో నిర్మించిన 17,600 క్రీడా ప్రాంగణాలకు స్పోర్ట్స్ కిట్లను త్వరలో పంపిణీ చేస్తాం. సీఎం కప్ క్రికెట్ టోర్నీకి ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతీ నియోజకవర్గంలో స్టేడియాల నిర్మాణం వేగవంతంగా పూర్తిచేస్తాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, సాట్స్ అధికారులు పాల్గొన్నారు.