హైదరాబాద్, జనవరి22 (నమస్తే తెలంగాణ): జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పతకాలు సాధించిన నల్లగొండ జిల్లా తుమ్మడంలోని బీసీ గురుకుల పాఠశాల విద్యార్థినులను బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో భవజ్ఞ బంగారు పతకం, అక్షయ, మనస్విని, హరిప్రియ రజత పతకాలను సాధించారు.
సోమవారం సచివాలయంలో మంత్రిని వారు మర్యాదపూర్వకంగా కలవగా, ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య భట్టు, ప్రిన్సిపాల్ రాములు, పీఈటీ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.