IPL 2025 : వరుణిడి అంతరాయంతో ఆలస్యం అవుతూ వచ్చిన క్వాలిఫయర్ 2 కాసేపట్లో మొదలవ్వనుంది. వాన తగ్గుముఖం పట్టడంతో.. పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు, రిఫరీ.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో, రాత్రి 9:45కు తొలి బంతి వేయనున్నారు. అంటే.. టాస్ పడిన 145 నిమిషాలకు మ్యాచ్ జరుగనుంది. వర్షం ముప్పు నేపథ్యంలో బీసీసీఐ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు అదనపు గంట కేటాయించడం కలసివచ్చింది.
సో.. ఇది నాకౌట్ పోరు కావడంతో పూర్తిగా 20 ఓవర్లు ఆడించనున్నారు. రెండు నిమిషాల బ్రేక్ తర్వాతే రెండో ఇన్నింగ్స్ షురూ కానుంది. దాంతో.. ఇప్పటివరకూ లైట్ షో, సంగీతం వింటూ గడిపిన ప్రేక్షకులు ఉత్కంఠ పొరాటాన్ని ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Good news from Ahmedabad!
The covers are off and the match will begin at 9:45 PM IST ⏰
No reduction in overs 🔢
Updates ▶ https://t.co/vIzPVlDqoC#TATAIPL | #PBKSvMI | #Qualifier2 | #TheLastMile
— IndianPremierLeague (@IPL) June 1, 2025
ఆదివారం అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ వేదికగా జరగాల్సిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఆసల్యంగా మొదలయ్యింది. టాస్ తర్వాత చినుకులు మొదలైన చినుకులు 2 గంటలకు గానీ తగ్గకపోవడమే అందుకు కారణం. జల్లులు తగ్గిన వెంటనే సిబ్బంది సూపర్ సాపర్స్తో ఔట్‌ఫీల్డ్‌లోని నీటిని తోడేశారు.