Singareni | రామవరం, జూన్ 1 : రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది సింగరేణి వ్యాప్తంగా ఏరియాల వారీగా ఉత్తమ ఉద్యోగులను సింగరేణి ప్రకటించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కొత్తగూడెం ఏరియాకు గాను జనరల్ అసిస్టెంట్ పానుగంటి రాంబాబు, సాంప్లింగ్ మజ్దూర్ జక్కుల గట్టయ్యలను ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేయడం జరిగింది అని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు ఒక ప్రకటనలో తెలిపారు.
వీరిలో పానుగంటి రాంబాబుకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం నందు జరుగు సెంట్రల్ ఫంక్షన్లో సంస్థ మేనేజింగ్ అండ్ డైరెక్టర్ ఎన్. బలరాం చేతుల మీదుగా, జక్కుల గట్టయ్యకి ప్రగతి వనంలో,తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రుధ్రంపూర్ నందు సాయంత్రం 7 గంటలకు జరుగు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు చేతుల మీదుగా సన్మానం నిర్వహించనున్నట్లు తెలిపారు.