MLA Rajasingh | హైదరాబాద్ : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారును, భద్రతా సిబ్బందిని నిత్యం ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు సూచించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహేష్ నోటీసులు జారీ చేశారు. భద్రతా కారణాల రీత్యా రాజాసింగ్ ఒంటరిగా తిరగవద్దు అని, ప్రభుత్వం ఇస్తున్న భద్రతా సిబ్బందిని వినియోగించుకోవాలని అన్నారు.
ఆదివారం ఉదయం రాజాసింగ్ ఒంటరిగా బుల్లెట్‌పై తిరగడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా నోటీసులు జారీ చేశారు. రాజా సింగ్‌కు తరచుగా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నా నేపథ్యంలో ఆయన ఒంటరిగా తిరగడం ప్రమాదకరమని, భద్రత సిబ్బంది లేకుండా తిరగవద్దు అంటూ డీసీపీ చంద్రమోహన్ సూచించారు.