Mark Boucher : క్వాలిఫైయర్ 2 పోరులో గుజరాత్ టైటాన్స్ చేతిలో భారీ ఓటమితో ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఇంటిదారి పట్టింది. ముంబై బౌలర్లు విఫలం కావడంతో గుజరాత్ ఓపెనర్ సెంచరీ బాదడంతో 233 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రోహిత్ సేన వరుసగా వికెట్లు కోల్పోయి 171 రన్స్‌కే ఆలౌటయ్యింది. దాంతో, మ్యాచ్ అనంతరం హెడ్ కోచ్ మార్క్ బౌచర్(Mark Boucher) తమ బౌలర్ల ఫిట్‌నెస్‌పై తీవ్రంగా స్పందించాడు.
ముంబై స్క్వాడ్‌లోని బౌలర్లు ఫిట్‌గా లేకుంటే ఫిట్‌గా లేకుంటే వేటు తప్పదని, వాళ్లను పక్కన పెడతామని, కొత్తవాళ్లకు చోటిస్తామని తెలిపాడు. ‘కష్టమైన పరిస్థితుల్లో అన్ని సమస్యల గురించి మాట్లాడడం అర్థ రహితం’ అని అతను అన్నాడు. దక్షిణాఫ్రికా మాజీ కీపర్ అయిన బౌచర్ 2022 సెప్టెంబర్ నుంచి ముంబై హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
స్టార్ పేసర్, యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా(Jaspreet Bumrah) వెన్నెముక గాయం కారణంగా పదహారో సీజన్‌కు మొత్తానికి దూరమయ్యాడు. స్టార్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, జై రిచర్డ్సన్ గాయం కారణంగాఈసారి కొన్ని మ్యాచ్‌లే ఆడారు. ఆర్చర్ ఆడిన రెండు మ్యాచుల్లో పెద్దగా రాణించలేదు. దాంతో, దాంతో, ముంబై బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపించింది. కానీ, బెహ్రన్‌డార్ఫ్, యంగ్‌స్టర్ ఆకాశ్ మధ్వాల్, సీనియర్ స్పిన్నర్ పీయూష్ చావ్లా అద్భుతంగా రాణించారు. ఎలిమినేటర్ పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌పై మధ్వాల్ 5 వికెట్లతో చెలరేగాడు. దాంతో, రోహిత్ సేన 82 పరుగుల భారీ విజయంతో క్వాలిఫైయర్ 2కు అర్హత సాధించింది.
ఆర్చర్, బుమ్రా, చావ్లా
గత సీజన్లో దారుణంగా విఫలమైన ముంబై ఇండియన్స్ 16వ సీజన్లో సంచలన ఆటతీరుతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. వరుస రెండు ఓటముల తర్వాత పుంజుకున్న ఆ జట్టు టైటిల్ ఫేవరెట్‌గా నిలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమైనా కూడా ఓపెనర్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్, నేహల్ వధర, టిమ్ డేవిడ్ దంచడంతో ప్లే ఆఫ్స్ చేరింది. అయితే.. క్వాలిఫైయర్ 2 పోరులో గుజరాత్ ముంబై ఇండియన్స్‌పై 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(129: 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లు) సెంచరీ బాదడంతో మొదట గుజరాత్ 2 వికెట్ల నష్టానికి 233 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్(55) ఒక్కడే పోరాడాడు. అయితే.. సీనియర్ పేసర్ మోహిత్ శర్మ 5 వికెట్లు తీయడంతో ముంబై 171కు ఆలౌటయ్యింది. దాంతో గుజరాత్ ఆదివారం (మే 28న) చెన్నై సూపర్ కింగ్స్‌తో టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది.