Michael Hussey | కాన్వే ప్రత్యేకమైన ఆటగాడు.. ఏ పరిస్థితుల్లోనైనా రన్స్ కొట్టగలడు : చెన్నై బ్యాటింగ్ కోచ్
Michael Hussey : పదోసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఐదో టైటిల్‌పై గురి పెట్టింది. పదిహేనో సీజన్లో అట్టడుగున నిలిచిన ఆ జట్టు ఈసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ సీజన్లో చెన్నై విజయాల వెనుక ఓపెనర్ డెవాన్ కాన్వే(Devon Conway) ఉన్నాడు. ఫైనల్ పోరుకు ముందు ఈ లెఫ్ట్ హ్యాండర్ఫై ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ(Michael Hussey) ప్రశంసలు కురిపించాడు.
Michael Hussey : పదోసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఐదో టైటిల్‌పై గురి పెట్టింది. పదిహేనో సీజన్లో అట్టడుగున నిలిచిన ఆ జట్టు ఈసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ సీజన్లో చెన్నై విజయాల వెనుక ఓపెనర్ డెవాన్ కాన్వే(Devon Conway) ఉన్నాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి సీఎస్కేకు శుభారంభాలు ఇస్తున్నాడు. ఫైనల్ పోరుకు ముందు ఈ లెఫ్ట్ హ్యాండర్ఫై ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ(Michael Hussey) ప్రశంసలు కురిపించాడు.
‘కాన్వే ఒక ప్రత్యేకమైన ప్లేయర్. అతడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పరుగులు చేయగలడు అని హస్సీ అన్నాడు. అంతేకాదు తనకు అతడిలా ఆడాలని ఉందని చెప్పుకొచ్చాడు. కాన్వేకు పరుగులు ఎలా రాబట్టాలో బాగా తెలుసు. కష్టమైన పరిస్థితుల్లోనూ అతడి బ్యాట్ నుంచి రన్స్ వస్తాయి’ అని హస్సీ తెలిపాడు.
6 హాఫ్ సెంచరీలు
ఇప్పటివరకూ ఆడిన 15 మ్యాచుల్లో కాన్వే 52.08 సగటుతో 625 రన్స్ కొట్టాడు. వీటిలో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పదహారో సీజన్లో కాన్వే అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. మూడు శతకాలు కొట్టిన శుభ్‌మన్ గిల్ ఆరెంజ్ క్యాప్ రేసులో ముందున్నాడు. అతను 16 మ్యాచుల్లో 60.78 సగుటతో 851 రన్స్ చేశాడు.
డెవాన్ కాన్వే – రుతురాజ్ గైక్వాడ్

అహ్మదాబాద్‌లో అమీతుమీ
క్వాలిఫైయర్ 1 గేమ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)పై 15 పరుగులతో తేడాతో విజయం సాధించింది. మొదట ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(60 : 44 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో, చెన్నై 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో స్పిన్నర్లు జడేజా, థీక్షణ చెలరేగడంతో గుజరాత్ 157 రన్స్‌కే ఆలౌటయ్యింది. క్వాలిఫైయర్ 2 పోరులో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(129: 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లు) సెంచరీ బాదడంతో గుజరాత్, ముంబైని 62 62 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రెండసారి ఫైనల్లో అడుగుపెట్టింది. మే 28న అహ్మదాబాద్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది.
ఇవి కూడా చదవండి
Malaysia Masters | మలేషియా మాస్టర్స్ ఫైనల్లో ప్రణయ్.. ముగిసిన సింధు పోరాటం
IPL 2023 Prize Money | ట్రోఫీ విజేతకు రూ.46.5 కోట్ల ప్రైజ్ మనీ..! క్యాప్ హోల్డర్స్‌కు ఎంతంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

