Malaysia Masters | మలేషియా మాస్టర్స్ ఫైనల్లో ప్రణయ్.. ముగిసిన సింధు పోరాటం
Malaysia Masters : భారత స్టార్ షట్లర్ హెచ్‌హెస్ ప్రణయ్(HS Prannoy) మలేషియా మాస్టర్స్ సూపర్ 500 ఫైనల్లోకి దూసుకెళ్లాడు. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన ఈ తెలుగు కుర్రాడు టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో పతకంపై ఆశలు రేపిన ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు(PV Sindhu) ఇంటిదారి పట్టింది.
Malaysia Masters : మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లో భారత్‌కు శనివారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్ షట్లర్ హెచ్‌హెస్ ప్రణయ్(HS Prannoy) మలేషియా మాస్టర్స్ సూపర్ 500 ఫైనల్లోకి దూసుకెళ్లాడు. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన ఈ తెలుగు కుర్రాడు టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. ఈ ఏడాది అతడికి ఇదే తొలి ఏటీపీ ఫైనల్ కావడం విశేషం.
మహిళల సింగిల్స్‌లో పతకంపై ఆశలు రేపిన ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు(PV Sindhu) ఇంటిదారి పట్టింది. శనివారం జరిగినసెమీఫైనల్లో ఆమె జార్జియా మరిస్కా తుంజంగ్(ఇండోనేషియా) చేతిలో 14-21,17-21తో ఓటమిపాలైంది. మరో తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.
క్రిస్టియన్ తప్పుకోవడంతో..
ఫామ్‌లో ఉన్న ప్రణయ్ సెమీఫైనల్లో క్రిస్టియన్ ఆదినాథ(ఇండేనేషియా)తో తలపడ్డాడు. అయితే.. క్రిస్టియన్ మోకాలి గాయంతో ఆట మధ్యలోనే తప్పుకున్నాడు. 19-17 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న క్రిస్టియన్ మ్యాచ్ మధ్యలో జంప్ చేసి వెనక్కి తిరుగుతుండగా మోకాలి నొప్పితో విలవిలలాడాడు. దాంతో, వెంటనే ప్రణయ్, భారత కోచ్ అతడి వద్దకు పరుగెత్తుకెళ్లారు. ఆట కొనసాగించేందుకు క్రిస్టియన్ సిద్ధంగా లేకపోవడంతో అడిని వీల్ చైర్ సాయంతో కోర్టు బయటకు తీసుకెళ్లారు. దాంతో నిర్వాహకులు ప్రణయ్‌ని విజేతగా ప్రకటించారు. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో వెంగ్ హాంగ్ యాంగ్(చైనా), లిన్ చున్ యీ(చైనీస్ తైపీ) మ్యాచ్ విన్నర్‌తో అతడు తలపడనున్నాడు. గత ఏడాది స్విస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన ప్రణయ్ ఈసారి విజేతగా నిలవాలనే కసితో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి
IPL 2023 Prize Money | ట్రోఫీ విజేతకు రూ.46.5 కోట్ల ప్రైజ్ మనీ..! క్యాప్ హోల్డర్స్‌కు ఎంతంటే..?
Sean Abbott | టీ20ల్లో మళ్లీ ఫాస్టెస్ట్ సెంచరీ.. అండ్రూ సైమండ్స్ రికార్డు సమం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

