లండన్: టీ20 క్రికెట్ చరిత్రలో మరోసారి అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదైంది. ఆస్ట్రేలియాకు చెందిన ఆల్ రౌండర్ సీన్ అబ్బాట్ ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 లీగ్ మ్యాచ్‌లో ఈ రికార్డును నమోదు చేశాడు. సర్రే జట్టు తరఫున ఆడిన 31 ఏళ్ల సీన్ అబ్బాట్.. ప్రత్యర్థి జట్టు అయిన కెంట్ బౌలర్లపై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దాంతో కేవలం 34 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు.
దాంతో ఆస్ట్రేలియాకే చెందిన మరో ఆల్‌రౌండర్, దివంగత అండ్రూ సైమండ్స్ రికార్డును సమం చేసి, టీ20ల్లో వేగవంతమైన సెంచరీ చేసిన మరో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కాగా అండ్రూ సైమండ్స్ కూడా 2004లో ఇంగ్లండ్‌లోనే జరిగిన లీగ్‌లో కెంట్ జట్టు తరఫున ఆడి మిడిల్‌సెక్స్‌పై 34 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇప్పుడు సీన్ అబ్బాట్ కూడా 34 బంతుల్లో సెంచరీ చేసి సైమండ్స్ సరసన చేరాడు.