IPL 2025 | ఐపీఎల్లో శనివారం గుజరాత్‌తో టైటాన్స్ జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండిమన్స్ 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జట్టు చాలా తప్పులు చేసిందని.. వసరమైన ప్రదర్శన చేయలేదని కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ముంబయి ఇండియన్ బ్యాట్స్‌మెన్‌ను హెచ్చరించాడు. రోహిత్ శర్మ, నమన్ ధీర్, ర్యాన్ రికెల్టన్ వంటి బ్యాట్స్‌మెన్స్ విఫలమైన విషయం తెలిసిందే. టైటాన్స్ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ముంబయి ఆరు వికెట్ల 160 పరుగులు మాత్రమే చేయగలిగింది.
మ్యాచ్ ముగిసిన అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. బౌలింగ్‌లో 15 నుంచి 20 పరుగులు అదనంగా ఇచ్చామని చెప్పాడు. బ్యాటింగ్‌లోనూ 15 నుంచి 20 పరుగులు తక్కువగా వచ్చాయని అనుకుంటున్నానని పేర్కొన్నారు. ఫీల్డింగ్‌లో కూడా ప్రొఫెషనల్‌గా లేమని.. తాము ప్రాథమికంగా తప్పులు చేశామని.. దాంతో 20 నుంచి 25 పరుగులు తగ్గాయని చెప్పాడు. గుజరాత్ ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ప్రమాదకరమైన షాట్లు ఆడకుండానే పరుగులు చేయగలిగారని.. బౌలర్లు సైతం పెద్దగా అవకాశాలు ఇవ్వలేదని తెలిపాడు. ప్రస్తుతం ముంబయి జట్టులో అందరూ బాధ్యత తీసుకోవాలని.. ప్రస్తుతం ఐపీఎల్లో ప్రారంభ దశలోనే ఉన్నామని పేర్కొన్నాడు.
బ్యాట్స్‌మెన్ పరుగులు చేయాలని.. రాబోయే మ్యాచుల్లో రాణిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అహ్మదాబాద్ పిచ్‌పై స్లో బాల్స్ కఠిమైనవని.. ప్రసిద్ధ్ కృష్ణ (18 పరుగులకు 2 వికెట్లు), మహ్మద్ సిరాజ్ (34 పరుగులకు 2 వికెట్లు) పదునైన బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (48), తిలక్ వర్మ (39) జోడీ మినహా మిగతా ముబయి బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ, బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ముంబయి ఇండియన్స్‌ను 36 పరుగుల తేడాతో ఓడించి ప్రస్తుత సీజన్లో గుజరాత్ తొలి విజయాన్ని నమోదు చేసింది.
ముంబయి ఇండియన్స్‌కి ఇది రెండో ఓటమి. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. 41 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో సాయి సుదర్శన్ 63 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ (38), జోస్ బట్లర్ (39), రూథర్‌ఫోర్డ్ (18) రాణించారు. గుజరాత్ బౌలర్లు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణకు చెరో రెండు, రబాడా, సాయి కిశోర్‌కు చెరో వికెట్ దక్కింది.