Wimbledon : వింబుల్డన్ టోర్నీ ఆరంభం రోజే సంచలనం నమోదైంది. పురుషుల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్ డానిల్ మెద్వెదేవ్ (Daniil Medvedev) తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. నిరుడు ఫ్రెంచ్ ఓపెన్ మొదటి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన ఈ రష్యన్ స్టార్ గ్రాస్ కోర్టుపై తేలిపోయాడు. తొమ్మిదో సీడ్ అయిన మెద్వెదేవ్‌కు 64వ ర్యాంకర్ బెంజమిన్ బొంజి ఊహించని షాకిచ్చాడు. గ్రీస్ వీరుడు స్టెఫానో సిట్సిపాస్ (Stefano Tsitsipas) సైతం అనూహ్యంగా తొలి రౌండ్ మధ్యలోనే వైదొలిగాడు. మరోవైపు.. మహిళల సింగిల్స్‌లో అరినా సబలెంకా ముందంజ వేసింది.
గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో మెద్వెదేవ్‌కు చెత్త రికార్డే ఉంది. టాప్ సీడ్లలో ఒకడిగా పేరొందిన అతడు పలుమార్లు తొలి రౌండ్లోనే వెనుదిరిగిన సందర్భాలున్నాయి. 2017లో మెద్వెదేవ్ వరుసగా ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ మొదటి మ్యాచ్‌లోనే చేతులెత్తేశాడు. రెండేళ్ల క్రితం కూడా రొలాండ్ గారోస్‌లో రెండో రౌండ్‌కు వెళ్లలేకపోయాడు.
“I’m super happy to be back.”
After missing #Wimbledon with injury in 2024, Aryna Sabalenka is thrilled to be back at SW19 💚💜 pic.twitter.com/kDCo7UEmVE
— Wimbledon (@Wimbledon) June 30, 2025
సోమవారం జరిగిన మ్యాచ్‌లో పట్టుదలగా పోరాడిన బెంజమిన్ 7-6, 3-6, 6-2తో గెలుపొందాడు. అయితే.. తాను ఏమంత ఆందోళన చెందడం లేదని మ్యాచ్ అనంతరం అన్నాడు. ఈ క్షణమైతే నేను పెద్దగా కంగారు పడడం లేదు. ఈ ఏడాది నేను ఒకవేళ 15వ ర్యాంక్‌కు పడిపోతే టెన్షన్ పడుతాను. ప్రస్తుతానికైతే ఈ ఓటమిని లైట్‌గానే తీసుకుంటున్నా అని రష్యన్ స్టార్ తెలిపాడు.