శుక్రవారం 22 జనవరి 2021
Sports - Jan 14, 2021 , 15:15:51

ఆ 11 మంది ఎవరో ఇప్పుడే చెప్పలేం: బ్యాటింగ్‌ కోచ్‌

ఆ 11 మంది ఎవరో ఇప్పుడే చెప్పలేం: బ్యాటింగ్‌ కోచ్‌

బ్రిస్బేన్‌: భారత ఆటగాళ్ల గాయాలను బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తోందని  టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌  తెలిపారు. గాయాల వల్ల ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులోనే భారత్‌ అనేక మార్పులతో బరిలో దిగాల్సి వస్తోంది. భారత ప్రధాన పేసర్‌ బుమ్రా  పొత్తి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు.  వైద్య సిబ్బంది నిరంతరం బుమ్రా ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాథోడ్‌ చెప్పారు. బుమ్రా ఆడతాడో లేదో అనే విషయం రేపు తెలుస్తుందన్నారు. 

'మెడికల్‌ టీమ్‌ బుమ్రాతో కలిసి పనిచేస్తోంది. అతడు సిద్ధంగా ఉన్నాడా లేడా అనేదాని కోసం రేపటి వరకు ఆగాల్సిందే.  ఆఖరి టెస్టులో ఆడే 11 మంది ఎవరనేది ఇప్పుడే చెప్పలేం. చాలా మంది గాయాలతో సతమతమవుతున్నారు.  రేపు ఉదయంలోగా మ్యాచ్‌లో ఆడే ఆటగాళ్లపై స్పష్టత వస్తుంది. విపత్కరపరిస్థితుల్లోనూ ఆటగాళ్లు బాగా సన్నద్ధమవుతున్నారు. ఆటగాళ్లు మానసికంగా బలంగా ఉన్నారు. వాళ్ల సామర్థ్యంపై ఆటగాళ్లు నమ్మకంతో ఉన్నారు. అత్యుత్తమ జట్టును ఎంపిక చేస్తామని'  రాథోడ్‌ వివరించారు.    భారత్, ఆస్ట్రేలియా మధ్య   నాలుగో టెస్టు శుక్రవారం నుంచి గబ్బా మైదానంలో మొదలవనుంది. 


logo