Rohit Sharma : భారత కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించనుంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) కీలక నిర్ణయం తీసుకుంది. వాంఖడే మైదానంలోని ఒక స్టాండ్‌కు రోహిత్ పేరు పెట్టనుంది. ఈ విషయాన్ని మంగళవారం ఎంసీఏ ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు. ఐపీఎల్ 18వ సీజన్ సందర్భంగా సన్ రైజర్స్‌తో మ్యాచ్ సమయంలోనే రోహిత్ పెవిలియన్‌ను ఆవిష్కరించే అవకాశముంది.
మంగళవారం ముంబై క్రికెట్ అసోసియేషన్ వార్షిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వాంఖడేలోని స్టాండ్స్‌కు క్రికెట్ దిగ్గజాల పేర్లపై చర్చించారు అధికారులు. ఈ క్రమంలోనే భారత జట్టుకు, ముంబై క్రికెట్‌కు విశేష సేవలందించిన హిట్‌మ్యాన్‌ను గొప్పగా గౌరవించాలని అనుకున్నారంతా. ‘వాంఖడేలోని దెవిచ పెవిలియన్‌కు రోహిత్ శర్మ స్టాండ్‌గా నామకరణం చేయాలని తీర్మానించాం’ అని ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్(Ajinkya Naik) తెలిపాడు.
👏👏https://t.co/r5rtqkZCxT#RohitSharma pic.twitter.com/RNJykFL2S8
— Cricbuzz (@cricbuzz) April 15, 2025
అంతేకాదు గ్రాండ్ స్టాండ్ లెవల్ 3ని శరద్ పవార్ స్టాండ్‌గా.. లెవల్ 4 స్టాండ్‌ను అజిత్ వాడేకర్ పెవిలియన్‌గా పిలువబోతున్నట్టు చెప్పాడు అజింక్యా. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్.. జట్టుపై చెరగని ముద్ర వేశాడు. రికార్డు ట్రోఫీలతో చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్ 17వ ఎడిషన్ నుంచి ఓపెనర్‌గా మాత్రమే బరిలోకి దిగుతున్నాడు.