IPL 2025 : బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన పంజాబ్ కింగ్స్ సొంతగడ్డపై తడబడింది. కోల్‌కతా నైట్ రైడర్స్ పేసర్ హర్షిత్ రానా(3-25) నిప్పులు చెరగడంతో సగం వికెట్లు కోల్పోయింది. ధాటిగా ఆడే క్రమంలో నేహల్ వధేరా(10) ఔటయ్యాడు. నోర్జి బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్ చేతికి చిక్కాడు. దాంతో, 74 వద్ద పంజాబ్ ఐదో వికెట్ పడింది. ప్రస్తుతం ఇంప్యాక్ట్ ప్లేయర్ సూర్యాన్ష్ షెడ్గే(1), గ్లెన్ మ్యాక్స్‌వెల్(7) క్రీజులో ఉన్నారు. 9 ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 76-5.
టాస్ గెలిచిన పంజాబ్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. తొలి ఓవర్లో వైభవ్ ఆరోరా 4 రన్స్ ఇవ్వగా.. ఆ తర్వాత అన్రిచ్ నోర్జి ఓవర్లో.. ప్రియాన్స్ ఆర్య(22) రెండు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత వైభవ్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్(30) వరుసగా 4, 6, 4 బాదగా.. ఐదో బంతిని ప్రియాన్ష్ లాంగాఫ్‌లో బౌండరీకి తరలించాడు. దాంతో పంజాబ్ స్కోర్ 30 దాటింది. ఆ తర్వాత హర్షిత్ రెండు బంతుల వ్యవధిలో ప్రియాన్స్, శ్రేయస్ అయ్యర్‌లను పెవిలియన్ పంపాడు. వీళ్లిద్దరి క్యాచ్‌లను రమన్‌దీప్ సింగ్ చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. ఆదుకుంటాడనుకున్న జోష్ ఇంగ్లిస్(2)ను వరుణ్ చక్రవర్తి బౌల్డ్ చేసి మూడో వికెట్ అందించాడు.అంతే.. పంజాబ్ కష్టాల్లో పడింది.