IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భీకర బ్యాటింగ్ లైనప్‌తో కొండంత స్కోర్ కొడుతూ పంజాబ్ కింగ్స్(Punjab Kings) సొంతగడ్డపై కుప్పకూలింది. ముల్లనూర్‌లో టాపార్డర్ వైఫల్యంతో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ల విజృంభణతో పంజాబ్ 15.3 ఓవర్లకే ఆలౌటయ్యింది. పేసర్ హర్షిత్ రానా(3-25) నిప్పులు చెరగగా.. స్పిన్ ద్వయం వరుణ్ చక్రవర్తి(2-21), సునీల్ నరైన్(2-14)లు తిప్పేశారు. దాంతో, 111 పరుగులకే పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది.
టాస్ గెలిచి దూకుడు ఇన్నింగ్స్ ఆరంభించింది పంజాబ్. ఓపెనర్లు ప్రియాన్స్ ఆర్య(22), ప్రభ్‌సిమ్రన్ సింగ్()లు బౌండరీలతో చెలరేగి జట్టుకు శుభారంభం ఇచ్చారు. అన్రిచ్ నోర్జి ఓవర్లో.. రెండు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత వైభవ్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్(30) వరుసగా 4, 6, 4 బాదగా.. ఐదో బంతిని ప్రియాన్ష్ లాంగాఫ్‌లో బౌండరీకి తరలించాడు. దాంతో పంజాబ్ స్కోర్ 3 ఓవర్లకే 30 దాటింది. దాంతో, మళ్లీ అయ్యర్ సేన రెండొదలు కొట్టడం ఖాయం అనుకున్నారంతా.
Innings Break!
An exceptional bowling performance from #KKR, led by Harshit Rana, bundles #PBKS for 1️⃣1️⃣1️⃣
Updates ▶️ https://t.co/sZtJIQoElZ#TATAIPL | #PBKSvKKR pic.twitter.com/cbWTsmAPii
— IndianPremierLeague (@IPL) April 15, 2025
దంచికొడుతున్న పంజాబ్ కింగ్స్ ఓపెనర్లను కట్టడి చేసేందుకు కెప్టెన్ అజింక్యా రహానే బంతిని హర్షిత్ రానా(3-25) చేతికి ఇచ్చాడు. తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన ప్రియాన్ష్.. రెండో బంతికి ఫైన్ లెగ్‌లో పెద్ద షాట్ ఆడాడు. కానీ, అక్కడే కాచుకున్న రమన్‌దీప్ సింగ్ క్యాచ్ అందుకున్నాడు. 39 వద్ద పంజాబ్ తొలి వికెట్ పడింది. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(0) కీలక ఇన్నింగ్స్ ఆడతాడనుకుంటే.. సిక్సర్‌కు యత్నించి రమన్‌దీప్ చేతికి చిక్కాడు. అంతే.. పంజాబ్ వికెట్ల పతనం మొదలైంది. ఆ కాసేపటికే జోష్ ఇంగ్లిస్()ను వరుణ్ చక్రవర్తి(2-21) బౌల్డ్ చేసి మూడో వికెట్ అందించాడు.
🎥🔽 Watch Resilient Harshit Rana’s splendid spell of 3/25 🔥#TATAIPL | #PBKSvKKR
— IndianPremierLeague (@IPL) April 15, 2025
పవర్ ప్లే ముగుస్తుందనగా రెండు సిక్సర్లు బాదిన ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్‌ను హర్షిత్ డగౌట్‌కు పంపాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్(7) మరోసారి నిరాశపరచగా.. ఆ తర్వాత రంగంలోకి దిగిన సునీల్ నరైన్ (2-14) సైతం వికెట్ల వేట కొనసాగించాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్ సూర్యాన్ష్ షెడ్గే(4), మార్కో యాన్సెన్(1)లను పెవిలియన్ పంపాడు. సహచరులు వరుసగా ఔట్ అవుతున్నాశశాంక్ సింగ్(18) ఒంటరి పోరాటం చేశాడు. అయితే.. అతడిని ఎల్బీగా ఔట్ చేసిన వైభవ్ అరోరా పంజాబ్‌ను ఆలౌట్ అంచున నిలిపాడు. ఆఖర్లో గ్జావియర్ బార్ట్లెట్(11) ధాటిగా ఆడి జట్టు స్కోర్ 100 దాటించాడు. అయితే.. 15.3వ ఓవర్లో అతడు రనౌట్ కావడంతో పంజాబ్ ఇన్నింగ్స్ 111 వద్ద ముగిసింది.