Kylian Mbappe : ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్ కిలియన్ ఎంబాపే (Kylian Mbappe) మైదానంలోకి దిగితే గోల్స్ వర్షమే. ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై చిరుతలా దాడి చేసి జట్టును గెలిపించే యోధుడు అతడు. ఈమధ్య ముక్కుకు గాయం కారణంగా కొత్త క్లబ్ రియల్ మాడ్రిడ్ (Real Madrid) క్లబ్ తరఫున అతడు పెద్దగా ఆడడం లేదు. అయితే.. ఊహించని విధంగా ఎంబాపే వార్తల్లో నిలిచాడు. సాకర్ దిగ్గజంగా ఎదుగుతున్న అతడి పై లైగింక వేధింపుల కేసు నమోదైంది. స్వీడన్ పోలీసులు ఎంబాపేపై తమకు ఒకరు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. అయితే.. సదరు మహిళ ఎవరనేది మాత్రం వాళ్లు వెల్లడించలేదు.
ఈ విషయంపై వెంటనే స్పందించిన ఎంబాపే తే.. అదంతా ఫేక్ న్యూస్ అని స్పష్టత ఇచ్చాడు. తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ పెట్టాడు. ‘నాపై వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవం. అలాంటి వార్తలను ప్రచారం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని ఎంబాపే తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
FAKE NEWS !!!! ❌❌❌
Ça en devient tellement prévisible, veille d’audience comme par hasard 😉 https://t.co/nQN98mtyzR— Kylian Mbappé (@KMbappe) October 14, 2024
ప్రపంచ ఫుట్‌బాల్‌లో సంచలనంగా మారిన ఎంబాపే 2007లో మొనాకో క్లబ్ నుంచి పారిస్ సెయింట్ జర్మనీ (Paris Saint Germany) చేరాడు. అప్పటి నుంచి ఏడేండ్లు ఆ క్లబ్‌కు ఆడాడు. పీఎస్జీ తరఫున 306 మ్యాచ్‌లు ఆడిన ఎంబాపే 255 గోల్స్ కొట్టడమే కాకుండా 108 గోల్స్ చేయడంలో సహచరులకు సహాయం చేశాడు. కొత్త సీజన్‌కు ముందు పీసీజీతో ఏడేండ్లుగా ఉన్న బంధానికి ఎంబాపే బై బై చెప్పేశాడు.
రెండేండ్ల క్రితం ఖతర్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో ఎంబాపే అదరగొట్టాడు. అర్జెంటీనా(Arjentina)తో హోరాహోరీగా ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్ (Hat-trick Goals) కొట్టి లియోనల్ మెస్సీ సేనను వణికించాడు. కానీ, అనూహ్యంగా షూటౌట్లో 2-4తో ఫ్రాన్స్ ఓటమి పాలైంది. జట్టుకు వరల్డ్ కప్ అందించలేకపోయిన ఎంబాపే.. అత్యధికంగా 8 గోల్స్ కొట్టి ‘గోల్డెన్ బూట్’ అవార్డు అందుకున్నాడు.