WIW vs ENGW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. వెస్టిండీస్ బౌలర్ల విజృంభణతో శుభారంభం దక్కపోయినా ఆల్‌రౌండర్ నాట్ సీవర్ బ్రంట్(57 నాటౌట్) దంచేసింది. విండీస్ స్పిన్నర్లను స్వీప్ షాట్లతో సమర్ధంగా ఎదుర్కొంటూ అర్ధ సెంచరీతో అజేయంగా నిలిచింది. అయితే.. అఫీ ఫ్లెచర్(314) కీలక వికెట్లు తీయడంతో పాటు పొదుపైన బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టింది. కెప్టెన్ హీథర్ నైట్(21), ఓపెనర్ డానియల్ వ్యాట్(16)లు రాణించారు. దాంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.
గ్రూప్ బీ నుంచి సెమీస్ బెర్తు దక్కాలంటే గెలవక తప్పని మ్యాచ్.విండీస్ కెప్టెన్ మాథ్యూస్ టాస్ గెలిచి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే.. ఓపెనర్లు మైయ బౌచియర్(14), డానియల్ వ్యాట్(16)లు ధనాధన్ ఆడినా స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. టాపార్డర్ విఫలమైంది. కరీబియన్ సారథి మాథ్యూస్ డేంజరస్ వ్యాట్‌ను బోల్తా కొట్టించింది. దాంతో, 29 వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ పడింది.
Halfway stage, outstanding knock under pressure from @natsciver 🔥 pic.twitter.com/VX3IFhdswX
— England Cricket (@englandcricket) October 15, 2024
ఆ కాసేపటికే అలిసే క్యాప్సే(1) రనౌట్ కావడం.. బౌచియర్ను అఫీ ఫ్లెచర్ వెనక్కి పంపడం చకచకా జరిగిపోయాయి. 34 పరుగులకే టాపార్డర్ పెవిలియన్‌లో. ఆ దశలో కెప్టెన్ హీథర్ నైట్(21 రిటైర్డ్ హర్ట్), నాట్ సీవర్ బ్రంట్(57 నాటౌట్)లు బాధ్యతగా ఆడారు. బ్రంట్ అయితే స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో బౌండరీలు సాధిస్తూ స్కోర్ బోర్డును ఉరికించింది. నాలుగో వికెట్‌కు 60 పరుగుల జోడించిన ఈ జంటను ఇంగ్లండ్‌ను ఆదుకుంది.
England skipper Heather Knight has retired hurt and Amy Jones is the new batter in 😓
FOLLOW: https://t.co/ENqk7q5GLc | #T20WorldCup pic.twitter.com/uy0UC8Segz
— ESPNcricinfo (@ESPNcricinfo) October 15, 2024
నైట్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో జట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్యతను బ్రంట్ భుజాన వేసుకుంది. ఆమెకు టెయిలెండర్లు అమీ జోన్స్(7), గిబ్సన్(7)లు సహకరించారు. ఇక 20వ ఓవర్లో సోఫీ ఎకిల్‌స్టోన్(7) భారీ సిక్సర్, బ్రంట్ ఓ బౌండరీ బాదేయడంతో ఇంగ్లండ్ స్కోర్ 140 దాటేసింది. బలమైన బ్యాటింగ్ లైనప్ గల విండీస్‌కు ఇది కష్టమైన లక్ష్యం అయితే కాదు. కానీ, ఇంగ్లండ్ ఇంగ్లండ్ స్పిన్నర్లు ఎకిల్‌స్టోన్‌ను వాళ్లు ఎదుర్కొంటారు? అనేదానిపై కరీబియన్ల సెమీస్ ఆశలు ఆధరా పడి ఉన్నాయి.