అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (Skill Development case) కేసులో ఏపీ సీఐడీ (AP CID) దూకుడును పెంచింది. 2014-19 వరకు చంద్రబాబు (Chandra Babu) హయాంలో స్కిల్ డెవలప్మెంట్లో అక్రమంగా రూ. 240 కోట్లను షెల్ కంపెనీలకు తరలించారన్న వైఎస్ జగన్ ప్రభుత్వం సీఐడీ విచారణ చేపట్టింది. ఈ కేసులోనే చంద్రబాబు 52 రోజుల పాటు జైలు(Jail) లో ఉన్నారు.
గత సంవత్సరంగా స్థబ్దుగా ఉన్న కేసును సీఐడీ తాజాగా సిమెన్స్ కంపెనీ ఆస్తులను మంగళవారం ఈడీ అటాచ్మెంట్ చేసింది. రూ. 370 కోట్ల ప్రాజెక్టును ఏకంగా రూ. 3,300 కోట్లకు పెంచేరన్న అభియోగంపై నాటి ప్రభుత్వం కేసులు నమోదు చేసి సీఐడీ విచారణకు ఆదేశించింది. నకిలీ ఇన్వాయిస్ల ద్వారా వస్తువులు కొనుగోలు చేసినట్లు గుర్తించిన ఈడీ డీటీసీఎల్ ఎండీ ఖాన్వెల్కర్, సుమన్ బోస్, ముకుల్ చంద్ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది.